అవన్నీ రూమర్లు..ఎన్టీఆర్ బయోపిక్ పై క్రిష్ క్లారిటీ!

July 19, 2018 at 3:41 pm
అవన్నీ రూమర్లు..ఎన్టీఆర్ బయోపిక్ పై క్రిష్ క్లారిటీ!

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్నారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో షరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య కాకుండా ఎవరెవరు కీలక పాత్రల్లో నటించబోతున్నారు అనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా రానా సావిత్రిగా కీర్తి సురేష్ శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయ్యారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా హంగామా నడిచింది.

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి కొన్ని కీలక విషయాలు దర్శకులు క్రిష్ మరియు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. అధికారికంగా తాము చెప్పకుండా బయట వస్తున్నావని అవాస్తవాలని తేల్చి చెప్పారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది..ఎందుకంటే ఆమె బాలకృష్ణ ఫ్యామిలీని కలిసి ఎన్టీఆర్ సతీమణి గురించిన వివరాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేశాయి.

37361108_502859093503881_377249612085329920_o

అయితే విడుదల టార్గెట్ చేసుకున్న జనవరికి కేవలం 5 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ చివరి వారం లోగా షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ చేతిలో ఉండాలి. మరి ఇప్పటి వరకు ఈ సినిమాలో నటీ,నటుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కాకపోతే క్రిష్ మాత్రం పూర్తి క్లారిటీతో ఉన్నాడట. ఇంత కన్నా క్లిష్టమైన గౌతమిపుత్రశాతకర్ణిని 84 రోజుల్లో పూర్తి చేసిన తనకు ఎన్టీఆర్ కోసం ఇచ్చిన ఆరు నెలల సమయం సరిపోతుందని అన్నాడట. మరి ఇంకా కీలకమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాటికి ఎవరెవరు వస్తారో అని అభిమానులకే కాదు సగటు సినిమా ప్రేమికులకు కూడా సస్పెన్స్ గానే ఉంది.

37220782_502859050170552_7181248824298438656_o

37269401_502859066837217_4823382559855476736_o

అవన్నీ రూమర్లు..ఎన్టీఆర్ బయోపిక్ పై క్రిష్ క్లారిటీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share