క్రిష్ కు ” శ్రీకృష్ణదేవరాయులు ” దొరికినట్టే..!

February 16, 2017 at 7:58 am
add_text

తెలుగులో హిస్టారిక‌ల్ సినిమా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న‌దే. ఎంత బాగా తీసినా క‌మ‌ర్షియ‌ల్‌గ స‌క్సెస్ కావ‌డం చాలా క‌ష్టం. అయితే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో ఆ లెక్క‌ల‌న్నీ మార్చేశాడు క్రిష్‌. అప్ప‌టి వ‌ర‌కు క్రిష్‌కు కూడా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లేదు. కానీ ఈ సినిమాతో హిస్టారిక‌ల్ స‌బ్జెక్టును ఎంచుకుని హిట్ కొట్ట‌డంతో పాటు బాల‌య్య కేరీర్‌లో కూడా 100వ సినిమా హిట్ చేసి మ‌ర‌పురాని అనుభూతులు మిగిల్చాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని త‌న వైపున‌కు తిప్పుకున్నాడు క్రిష్‌.

శాత‌కర్ణి ఇచ్చిన హిట్‌తో ఇప్పుడు క్రిష్ దృష్టి మ‌రోసారి చారిత్ర‌క క‌థ‌ల‌పై ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌దేశాన్ని ఏలిన శ్రీకృష్ణ‌దేవ‌రాయులు క‌థ‌తో క్రిష్ మ‌రో చారిత్ర‌క సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు. శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు క‌థ‌ని వెండితెర‌పై చూసుకోవాల‌ని ఆయ‌న‌కు మ‌క్కువ‌గా ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని క్రిష్ స్వ‌యంగా వెల్ల‌డించాడు.

క్రిష్ స్టామినా, టెక్నిక‌ల్‌గా అత‌ని బ‌లం… గౌత‌మిపుత్ర‌తో సినీ జనాల‌కు బాగా తెలిసింది. క్రిష్ కృష్ణ‌దేవ‌రాయులు సినిమాను తీస్తానంటే ఏ హీరో అయినా ఓకే చెప్తారు. ఈ క్ర‌మంలోనే క్రిష్ మ‌రోసారి బాల‌య్య‌తో కృష్ణ‌దేవ‌రాయులు ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించాల‌నుకుంటున్నాడ‌ట‌.

బాల‌య్య గ‌తంలో ఆదిత్య 369లో కాసేపు దేవ‌రాయులుగా క‌నిపించి మెప్పించాడు బాల‌య్య‌. ఆయ‌న‌కూ పూర్తి స్థాయిలో ఆ పాత్ర పోషించాల‌ని ఉంది. ఇప్పుడు క్రిష్‌తో బాల‌య్య కోరిక తీరుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

క్రిష్ కు ” శ్రీకృష్ణదేవరాయులు ” దొరికినట్టే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share