ప్ర‌భాస్ సాహో రిజెక్ట్ చేసిన మెగా హీరోయిన్‌…పొగ‌రుక్కువా..!

బాహుబ‌లి దెబ్బ‌తో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఓ తెలుగు హీరోకు ఇంత స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టిన ఘ‌న‌త బాహుబ‌లి (డైరెక్ట‌ర్ ప‌రంగా రాజ‌మౌళి)కే ద‌క్కుతుంది. బాహుబ‌లితో వ‌చ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాను సైతం రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించేలా ప్లాన్ చేసుకున్నాడు.

ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వ‌స్తే ఎవ‌రైనా వ‌దులుకుంటారా ?  ఏ హీరోయిన్ కూడా వ‌దులుకుని రాంగ్ స్టెప్ వేయ‌దు. అయితే దిశాప‌టాని మాత్రం సాహో ఛాన్స్‌ను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింద‌ట‌.

ఆమె తెలుగులో మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో చేసిన లోఫ‌ర్‌, బాలీవుడ్లో చేసిన రెండు సినిమాలు సూప‌ర్ ప్లాప్‌లు. ఆమెను మామూలుగానే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాంటి దిశ సాహో సినిమాలో న‌టించ‌మ‌ని అడిగితే రూ. 5 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌.

దిశ లాంటి క్రేజ్ లేని హీరోయిన్‌కు ఐదు కోట్లు ఇవ్వ‌డం శుద్ధ దండ‌గ అని…అందులో స‌గం ఇస్తే బాలీవుడ్‌లో పేరున్న హీరోయిన్లు వ‌స్తార‌ని ఈ చిత్ర నిర్మాత‌లు భావించార‌ట‌. ప్ర‌భాస్ లాంటి హీరో ప‌క్క‌నే ఛాన్స్ వ‌దులుకుందంటే దిశాకు ఎంత పొగ‌రో అని ఇండ‌స్ట్రీలో ప‌లువురు ఆమెను విమ‌ర్శిస్తున్నారు.