అక్క‌డ డీజే ప్లాప్‌…క‌లెక్ష‌న్లు నిల్‌

భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన బ‌న్నీ డీజే సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. రివ్యూలు అయితే బ్యాడ్‌గానే ఉన్నాయి. అయితే సినిమా క‌లెక్ష‌న్ల‌కు టాక్‌కు సంబంధం లేదు. మూడు రోజుల్లోనే డీజే ఏకంగా రూ. 64 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. దీంతో డీజే యూనిట్ థ్యాంక్స్ మీట్‌లు అంటూ పెట్టి నానా హ‌డావిడి చేస్తోంది.

ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో డీజే క‌లెక్ష‌న్లు కుమ్ముతున్నా ఓవ‌ర్సీస్‌లో మాత్రం అట్ట‌ర్ ప్లాప్ దిశ‌గా వెళుతోంది. ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు ఎక్కువుగా రివ్యూలు చ‌దివే థియేట‌ర్ల‌కు వెళ‌తారు. రివ్యూలు ఏ మాత్రం తేడా కొట్టినా ఓవ‌ర్సీస్‌లో క‌లెక్ష‌న్ల‌పై ఆ ఎఫెక్ట్ గ‌ట్టిగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఓవ‌ర్సీస్‌లో డీజే ప్రీమియ‌ర్ల‌తో మంచి వ‌సూళ్లే రాబ‌ట్టినా లాంగ్ ర‌న్‌లో మాత్రం నిల‌బ‌డలేక‌పోతోంది. సినిమాకు రెండో రోజే వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత 75 శాతం స్క్రీన్లు తగ్గించేశారు. దీంతో క‌లెక్ష‌న్లు ఇక్క‌డ బాగా డ్రాప్ అయ్యాయి.

స‌ల్మాన్ ట్యూబ్‌లైట్‌తో డీజే వ‌సూళ్ల‌ను పోలుస్తున్నా ఆ సినిమాకు మ‌రింత దారుణ‌మైన వ‌సూళ్లు వ‌స్తున్నాయి. దాని కంటే డీజే కాస్త బెట‌ర్ అంతే. ఓవ‌రాల్‌గా డీజేకు ఇక్క‌డ పెట్టిన పెట్టుబ‌డికి, వ‌సూళ్ల‌కు పోల్చుకుంటే సినిమాను ప్లాపే అంటున్నారు.