భరత్ తో మ్యాచ్ ఓడి..ఇంగ్లాండ్ పండుగ చేసుకుంది

July 5, 2018 at 6:28 pm
England Cricket team, Celebrations after food ball match won, Team india

అదేంటీ ఎవరైనా ఓడిపోతే హృదయవిదారకంగా బాధపడటం..ముఖాలు చిన్నబుచ్చుకొని కుంగిపోవడం చూస్తుంటాం. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం తెగ సంబరాలు చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఓటమి పాలైన ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం ఆ రోజు నైట్ తెగ సంబరాలు చేసుకున్నారు..అయితే ఈ సంబరాలు ఓడినందుకు కాదు.. అదే రోజు రాత్రి అద్భుత పోరులో కొలంబియాపై నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరడమే ఇందుకు కారణం.

కాగా, ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లు చేసుకున్న సంబరాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఇంగ్లండ్‌ జట్టు కొలంబియాను మట్టికరిపించింది. ఇక భారత్ తో తొలి ట్వంటీ-20లో స్పిన్నర్ మాంత్రికుడు కుల్దీప్‌ యాదవ్‌ ధాటికి ఇంగ్లండ్‌ జట్టు అతలాకుతలం అయ్యింది. 54 బంతుల్లో సెంచరీ చేసిన కేఎల్‌ రాహుల్‌ ఛేజింగ్‌లో వార్వెవా అనిపించాడు.

అయితే ఫుట్ బాల్ ఆనందాన్ని ఆస్వాదించిన ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాళ్లు..ఎలాంటి ఒత్తిడి లేకుండా రెండో ట్వంటీ-20లోకి బరిలోకి దిగొచ్చు. మరోవైపు కుల్దీప్‌ను ఎదుర్కొనేందుకు ఆ జట్టు బ్యాట్స్‌మన్లు మెషీన్లతో బంతులు వేయించుకుని మరీ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మొత్తానికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

భరత్ తో మ్యాచ్ ఓడి..ఇంగ్లాండ్ పండుగ చేసుకుంది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share