ఈవారం టాలీవుడ్ ట్రేడ్ ట్రాక్…రిజల్ట్ ఇదే

February 10, 2017 at 9:46 am
74

టాలీవుడ్‌లో ఈ వారం సినిమాల ట్రేడ్ టాక్‌లో నేను లోక‌ల్ ఫ‌స్ట్ ప్లేసులో ఉంది. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టింది. కేవ‌లం 5 రోజుల్లోనే రూ.20 కోట్ల షేర్ మార్క్ రాబ‌ట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే స‌రికే నేను లోక‌ల్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట ప‌ట్టేసింది. ఈ సినిమా విజ‌యంతో నాని వ‌రుస‌గా ఆరో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుని డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా అరుదైన రికార్డు సృష్టించాడు.

జ‌న‌వ‌రిలో శతమానం భవతితో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన దిల్‌ రాజుకి వెంటనే ఫిబ్ర‌వ‌రిలో మ‌రో సూపర్‌హిట్‌ ఈ చిత్రంతో దక్కింది. రెండవ వారంలోను థియేటర్లు ఎక్కువే ఉండ‌డంతో నేను లోక‌ల్ లాంగ్ ర‌న్‌లో రూ.30 కోట్ల షేర్ మార్క్ సులువుగానే క్రాస్ చేయ‌నుంది. ఇక ఈ వారం రిలీజ్ అయిన సూర్య‌-హ‌రి సింగం 3 మంచి టాక్‌తో తొలి రోజు భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టింది.

మాస్ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు అదిరిపోయే వ‌సూళ్లు ద‌క్క‌నున్నాయి. తొలి రోజు సోలోగా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం కూడా సింగం-3కు ప్ల‌స్ అయ్యింది. ఇక నాగార్జున, రాఘవేంద్రరావుల భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’కి ప్రీ రిలీజ్‌ బజ్ మ‌రి అంత హైప్‌లో ఏం లేదు. ప్రేక్ష‌కుల స్పంద‌న‌, మౌత్ టాక్‌ను బ‌ట్టి ఈ సినిమా పుంజుకోవాల్సి ఉంటుంది.

ఈవారం టాలీవుడ్ ట్రేడ్ ట్రాక్…రిజల్ట్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share