ప‌వ‌న్ చేతిలో గోపీచంద్ ఫ్యూచ‌ర్‌

ఈ హెడ్డింగ్ కాస్త విచిత్రంగానే ఉన్న‌ట్లుంటుంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు గోపీచంద్‌కు లింకేంటి ? ప‌వ‌న్ చేతిలో గోపీచంద్ ఫ్యూచ‌ర్ ఏంట‌బ్బా అని బుర్ర‌బ‌ద్ద‌లు కొట్టేసుకుంటాం. కాట‌మ‌రాయుడు సినిమా త‌ర్వాత ప్ర‌స్తుతం ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ అగ్ర‌నిర్మాత ఏఎం.ర‌త్నం నిర్మాత‌గా కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఆర్‌టీ.నీశ‌న్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే సినిమాలో న‌టించాల్సి ఉంది.

ప‌వ‌న్ , త్రివిక్ర‌మ్ సినిమా పూర్తి చేసేందుకే మ‌రో మూడు, నాలుగు నెల‌లు ప‌డుతోంది. త‌ర్వాత 2019 ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా యేడాది కూడా టైం ఉండ‌దు. ఈ లోగా ఏఎం.ర‌త్నం సినిమా పూర్తి చేస్తాడా ? లేదా జ‌న‌సేన కార్య‌క‌లాపాల‌పై పూర్తిగా దృష్టి పెడ‌తాడా ? అన్న‌ది తెలియ‌కుండా ఉంది. ప‌వ‌న్ ఏఎం.ర‌త్నం సినిమాను ప‌ట్టాలెక్కిస్తేనే ఇక్క‌డ గోపీచంద్ హీరోగా ర‌త్నం నిర్మించిన ఆక్సిజ‌న్ సినిమాకు బిజినెస్ జ‌రిగేలా వాతావ‌ర‌ణం ఉంది.

ర‌త్నం ఆక్సిజ‌న్ సినిమాను ఈ సినిమా వెన‌కే ప‌వ‌న్ సినిమా కూడా ఉంద‌ని చూపించి అమ్మే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గోపీచంద్ సినిమాల‌పై బ‌య్య‌ర్లు ఇంట్ర‌స్ట్‌గా లేరు. ఆర‌డుగుల బుల్లెట్ చాలాసార్లు వాయిదాలు ప‌డుతూ వ‌చ్చి, గ‌త వారం కూడా ఆగిపోయింది. ఆక్సిజ‌న్‌ది అదే ప‌రిస్థితి. ఇక గౌత‌మ్‌నందా టీజ‌ర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఆక్సిజ‌న్‌ను బిజినెస్ చేసేందుకు ర‌త్నం వెన‌కే ప‌వ‌న్‌తో తాను తీస్తోన్న సినిమా ఉంద‌ని, ఆక్సిజ‌న్ కొంటే వాళ్ల‌కే ప‌వ‌న్ సినిమా రైట్స్ ఇస్తాన‌ని చెపుతున్నాడ‌ట‌. ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకుంటే మాత్రం ఆక్సిజ‌న్‌కు షాక్ త‌ప్ప‌దు. ఏదేమైనా ప‌వ‌న్ – ర‌త్నం సినిమా ప‌ట్టాలెక్కే వ‌ర‌కు ఆక్సిజ‌న్ బిజినెస్ జ‌రిగేలా లేదు.