‘హలోగురు ప్రేమకోసమే’ ఫస్ట్ డే కలెక్షన్స్

October 19, 2018 at 11:37 am

టాలీవుడ్ లోకి ‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తర్వాత ‘రెడీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఆ మద్య కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘నేను శైలజా’మంచి విజయం అందుకుంది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

44267180_2163535803894596_3539429724830826496_o

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాథరావు డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ.. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, కామెడీ బాగుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ – రామ్ ల మద్య వచ్చే సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. మ్యూజిక్ పరంగా ఈసారి దేవీశ్రీ కాస్త నిరాశపరిచారని టాక్ వచ్చింది. ఈ చిత్రానికి విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు.బెజవాడ ప్రసన్నకుమార్ మాటలు.. రచన సహకారం సాయికృష్ణ అందిస్తున్నారు. తాజాగా ‘హలో గురు ప్రేమ కోసమే’ఫస్ట్ డే కలెక్షన్లు చూద్దామా!

ఏరియా వైజ్ గా ‘హలో గురు ప్రేమ కోసమే’ఫస్ట్ డే కలెక్షన్లు :

ఏరియా ఫస్ట్ డే కలెక్షన్లు
నైజాం 1.53 కోట్లు
సీడెడ్ 0.49
యూ.ఏ. 0.46
గుంటూరు 0.43
ఈస్ట్ గోదావరి 0.27
వెస్ట్ గోదావరి 0.25
కృష్ణ 0.28
నెల్లూరు 0.13
ఏపి+తెలంగాణ 3.48 కోట్లు

ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం .. 17.65 కోట్లు

‘హలోగురు ప్రేమకోసమే’ ఫస్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share