‘హలోగురు ప్రేమ కోసమే’ ప్రీమియర్ షో టాక్

October 18, 2018 at 8:15 am

చిత్రం: హలోగురు ప్రేమ కోసమే..
నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం: త్రినాథరావు
నిర్మాణం: దిల్ రాజు
సంగీతం: దేవిశ్రీప్రసాద్

హలో గురు ప్రేమకోసమే.. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోహీరోయిన్లుగా.. త్రినాథరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం. సంగీతం దేవిశ్రీప్రసాద్. నేను శైలజ హిట్.. హైపర్, ఉన్నది ఒక్కటే జిందగి.. ఫ్లాప్ ల తర్వాత వస్తున్నది హలో గురు ప్రేమ కోసమే.. సినిమా. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు జనంలో మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా యూత్ నుంచి రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. దసరా పండుగ నాడు అంటే గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం.

Dpr3FIzXgAMP6HS

యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని నమ్ముకుని తీసిన సినిమా హలోగురు ప్రేమకోసమే. ఇలాంటి కథల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కానీ.. కథను నడిపించిన తీరు, డైలాగ్స్, చిన్న చిన్న ట్విస్ట్ లతో నే హిట్ కొడుతారు. ఇప్పుడు హలోగురు ప్రేమ కోసమే.. చిత్రం కూడా ఈకోవలోకే వస్తుంది. నిజానికి ఈ మధ్య తెలుగు సినిమాలు సీరియస్ కంటెంట్ తో వస్తున్నాయి. దీనికి భిన్నంగా ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ప్లస్ పాయింట్ గా మారుతుందని చెప్పొచ్చు. సరదా సరదాగా సాగిపోయే ఈ సినిమాతో యూత్ రిలీఫ్ పొందుతారనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో సంజు(రామ్) నిరుద్యోగి. ఉద్యోగం కోసం కాకినాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఓ సాఫ్టువేర్ కంపెనీలో ట్రైనీ ప్రోగ్రామర్ గా చేరుతాడు. కాకినాడ నుంచి ట్రైన్లో వచ్చే క్రమంలోనే అనుపమ పరిచయం అవుతుంది. ఇక తర్వాత ఏం జరిగింది..? ప్రణీత పాత్ర ఏమిటి..? ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఎలా నడిందన్నది మాత్రం తెరపైనే చూడాలి. ఈ చిత్రం ప్రధానంగా రామ్, అనుపమ, ప్రకాష్ రాజ్ చుట్టే తిరుగుతూ సరదా సరదాగా సాగిపోతుంది. ఇందులో ప్రధానంగా రామ్ ఫ్రెండ్ గా ప్రకాష్ రాజ్ నటించిన తీరు సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు బలంగా కనిపిస్తుంది. స్టోరీ పాతదే అయిన డైరెక్టర్ త్రినాధ్ రావు తన గత సినిమాలు ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ మాదిరిగానే మాంచి జోష్ తో డైరెక్ట్ చేసాడు. అలాగే రామ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా రామ్ మంచి మార్కులు కొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది.

చివరిగా… యూత్ కు పండుగ తెచ్చిన రామ్

‘హలోగురు ప్రేమ కోసమే’ ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share