ఆమెతో ఎఫైర్‌పై రాజ‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇండ‌స్ట్రీ అన్నాక హీరోల‌కు, హీరోయిన్ల‌కు ఎఫైర్లు ఉన్న‌ట్టు వార్త‌లు రావ‌డం కామ‌న్‌. ఇండ‌స్ట్రీలో చాలామందికి ఎఫైర్లు ఉన్నా లేక‌పోయినా విస్తృతంగా పెరిగిపోయిన మీడియా ఎఫెక్ట్‌తో ఎవ‌రో ఒక‌రితో లింకులు పెట్టి గాసిప్ వార్త‌లు రాయ‌డం కామ‌న్ అయిపోయింది. సీనియ‌ర్ హీరో, యాంగ్రీ యంగ్ మాన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ విష‌యంలో మాత్రం ఎఫైర్ల వార్త‌లు చాలా త‌క్కువ‌. రాజ‌శేఖ‌ర్ ప‌లానా హీరోయిన్‌తో ఎఫైర్ కొన‌సాగిస్తున్నాడ‌న్న వార్త‌లు మ‌నం పెద్ద‌గా విన‌లేదు.

ఇదిలా ఉంటే రాజ‌శేఖ‌ర్ తాజా సినిమా గ‌రుడ‌వేగ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న రాజ‌శేఖ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న లైఫ్‌లో ఉన్న అఫైర్ల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న చెప్పాడు.

తారా చౌద‌రీతో త‌న‌కు ఎలాంటి రిలేషన్లు లేవ‌ని, అయితే ఆమె ఇంట్లో త‌న ఫోటోలో ఉండ‌డంతోనే ఈ కాంట్ర‌వ‌ర్సీ త‌న మెడ‌కు చుట్టుకుంద‌ని ఆయ‌న చెప్పారు. ఆమెతో ఫొటో తీసుకున్న‌ప్పుడు ఓ సారి, జీవిత‌తో మ‌రోసారి మాత్ర‌మే క‌లిశాన‌ని రాజ‌శేఖ‌ర్ చెప్పారు. అయితే త‌న జీవితంలో కొన్ని ఆఫైర్లు ఉన్న‌మాట మాత్రం వాస్త‌వ‌మే అన్న రాజ‌శేఖ‌ర్ పెళ్లికి ముందు, జీవిత‌తో పెళ్లి త‌ర్వాత కొన్ని సంబంధాలు ఉన్నాయ‌ని బాంబు పేల్చారు. అయితే తారా చౌద‌రి విష‌యంలో మాత్రం తన‌ను తాను ఆయ‌న రాముడిగా అభివ‌ర్ణించుకున్నారు.