క‌ష్టాల్లో హీరో సునీల్ …. తెర వెన‌క ఏం జ‌రుగుతోంది

తెలుగులో త‌క్కువ టైంలోనే పాపుల‌ర్ క‌మెడియ‌న్‌గా మారిన సునీల్ అందాల రాముడు సినిమాతో వెండితెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు, పూల‌రంగ‌డు, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌ర్యాద‌రామ‌న్న సినిమాల‌తో ఒక్క‌సారిగా టాప్ పొజిష‌న్‌కు చేరుకున్నాడు. మిస్ట‌ర్ పెళ్లికొడుకు సినిమా నుంచి వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాప్ సినిమాలు చేస్తోన్న సునీల్ వ‌రుస‌గా ఆరేడు ప్లాపులు ఇచ్చాడు. కృష్ణాష్ట‌మి, జ‌క్క‌న్న‌, వీడు గోల్డ్ ఎహే, ఉంగ‌రాల రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ ప్లాపుల ప‌రంప‌ర‌కు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.

ఉంగరాల రాంబాబు సినిమాతో సునీల్ హీరో కెరీర్ దాదాపు ఫినిషింగ్ కు వచ్చేసిందనే పుకార్లు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సునీల్ సినిమాల‌కు బిజినెస్ అవ్వ‌డం లేదు స‌రిక‌దా…. శాటిలైట్ బిజినెస్ కూడా జ‌ర‌గ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు సునీల్‌తో సినిమాలు చేసేందుకే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇందులో సునీల్ వ్య‌క్తిగ‌తంగా చేసుకునే లోపాలు కూడా కొన్ని ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా సెట్స్‌మీద‌కు వెళ్లాల్సిన ఓ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆదిత్య 369, నాని – జెంటిల్ మెన్ చిత్రాల నిర్మాత కృష్ణప్రసాద్ శివ‌లెంక తమిళ సెతురంగ వెట్టై మూవీని సునీల్‌తో తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే సునీల్ స్క్రిఫ్ట్‌లో ఓవ‌ర్‌గా ఇన్వాల్ అయిపోయాడ‌ట‌. అదీకాకుండా ఈ సినిమాలో మ‌రో క‌మెడియ‌న్ కృష్ణ భ‌గ‌వాన్ కూడా ఉండాల‌ని కండీష‌న్ పెట్టాడ‌ట‌. ఇక రెమ్యున‌రేష‌న్‌లో కూడా నిర్మాత‌తో సునీల్‌కు గ్యాప్ రావ‌డంతో ఈ సినిమా డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ – నిర్మాత క‌లిసి సుధీర్‌బాబుతో క‌మిట్ అయిపోయిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా పోవ‌డంతో ఇప్పుడు సునీల్ కెరీర్ హీరోగా క‌ష్టాల్లో ప‌డిపోయింది. సునీల్‌కు ఇప్పుడు హీరోగా చేతిలో ఒక్క‌సినిమా కూడా లేదు. ఇక హీరోగా సునీల్ ప‌ని అయిపోయింద‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోన్న నేప‌థ్యంలో మ‌నోడు మ‌ళ్లీ కామెడీ రోల్స్‌కు షిఫ్ట్ అయిపోతున్నాడు. మ‌రి క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇస్తే ఇలాగైనా రాణిస్తాడేమో ? చూడాలి.