అమరేంద్ర బాహుబలి అను నేను..ఆ ఒక్క సీన్ చాలు

ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు..ఎలాంటి సినిమాలు తీశామన్నది ముఖ్యం.శుక్ర వారం సినిమా రిలీజ్ అయితే సోమవారానికల్లా అది ఏ సినిమానో కూడా గుర్తుపెట్టుకోలేనన్ని సినిమాలు పుట్టుకొస్తున్న రోజులివి.ఇలాంటి రోజుల్లో కూడా జాతి మొత్తం ఎదురుచూసేలా..చూసి గర్వించేలా..గర్వించి రొమ్ము విరిచి..ఇది ఇండియన్ సినిమా స్టామినా అంటే..తెలుగోడి సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటింది బాహుబలి.

రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.అలా మొదటి పార్ట్ లో విగ్రాహా ఆవిస్స్కరణ సీన్ కానీ..కాలకేయులు ఫైట్ సీన్స్ కానీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.అలాంటివి రెండో భాగం లో అనేకం వున్నాయి.అన్నిటికన్నా హై లైట్ అమరేంద్ర బాహుబలి అను నేను అని బాహుబలి సార్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశం మొత్తం సినిమాకే తలమానికం.

కుంతలా నుండి తిరిగొచ్చిన బాహుబలి,దేవసేనలు మాహిష్మతి లో జరిగే పరిణామాలు..బల్లాలుడి పట్టాభిషేకం..బాహుబలి సైన్యాధ్యక్షుడి సన్నివేశాలు ప్రేక్షకుల్ని కుర్చీలో కుర్చోనివ్వవు.ముందుగా భల్లాలుడు రాజుగా  దేవుడి సాక్షి ప్రమాణం చేయగా బాహుబలి ప్రమాణ స్వీకార పత్రాన్ని వారించి మాహిష్మతి ప్రజలను చూస్తూ రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనడం….దిక్కులు పిక్కటిల్లేలా..భూగోళం బద్దలయ్యేలా మొత్తం మాహిష్మతి సర్వ సైన్యాలు..యావత్ ప్రజానీకం బాహుబలి నామస్మరణతో మార్మోగించడం సినిమా మొత్తానికే హైలైట్.