శాటిలైట్ రేటులో అల్లు అర్జున్ సూప‌ర్ రికార్డు

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే పాపుల‌ర్ హీరోగా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు మ‌ళ‌యాళంలోను మంచి ఇమేజ్ తెచ్చుకుని అక్క‌డ కూడా మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్న బ‌న్నీ శాటిలైట్ విష‌యంలో అరుదైన ఫీట్‌కు రెడీ అవుతున్నాడు.

ప్ర‌స్తుతం హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌లో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ (డీజే) సినిమాలో న‌టిస్తోన్న అల్లు అర్జున్ ఈ సినిమా త‌ర్వాత స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మ‌ళ‌యాళం, హిందీ, త‌మిళ భాష‌ల్లో సైతం తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను అన్ని భాష‌ల్లో కలుపుకుని రూ. 25 కోట్లు బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే ఈ రేంజ్‌లో శాటిలైట్ రేటు ప‌లుకుతోందంటే సినిమా సెట్స్‌మీద‌కు వెళితే ఈ రేటు ఇంకెంత పెరుగుతుందో అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.