‘అరవింద సమేత’అప్పుడే ఊపేస్తున్నాడు!

October 8, 2018 at 4:42 pm

టాలీవుడ్ లో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ పోటీ లేకపోవడంతో ‘అరవింద సమేత’ కలెక్షన్లపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమా గనక హిట్ టాక్ వచ్చిందంటే..కలెక్షన్లు కూడా బీభత్సం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్లకు పైమాటే అన్నది ఇప్పడు టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్.

Do9tqWRU0AA59gW

ఇక వంద కోట్లు దాటిన సినిమాలు కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రంగస్థలం, భరత్ అనే నేను రెండువందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. అప్ కమింగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ సైతం వంద కోట్ల క్లబ్ లో చేరింది. పెద్ద హీరోల సినిమాలు అంటే వందకోట్లు సినిమాలు అన్నది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే పెద్ద హీరోలు అంతా 15 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. డైరక్టర్లు కూడా అదేబాటన వెళ్తున్నారు. అందుకే మినిమం వంద కోట్ల క్లబ్ లో చేరడం కామన్ అయ్యింది. దీనికితోడు మార్కెట్ కూడా అలాగే వుంది.

డిజిటల్, శాటిలైట్ ఇతరత్రా ఆదాయం పెరిగింది. థియేటర్ హక్కుల ఆదాయం కూడా ఇప్పడు బాగానే వుంది. మూడు రోజుల్లో ‘అరవింద సమేత’ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాకు నిర్మాతలకు నలభై కోట్లకు పైగానే లాభం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అయితే ‘అరవింద సమేత’సినిమా కోసం దాదాపు 82 కోట్లు ఖర్చు చేశారట..దీనికి ఇతరత్రా ఖర్చులు కలుపుకొని దాదాపు 92 కోట్లు అయిఉంటుందని అంచనా..కాగాసినిమా థియేటర్ హక్కుల రూపేణా 93కోట్ల వరకు వచ్చాయి…అంటే సినిమా పెట్టిన ఖర్చు పూర్తయ్యింది..ఇప్పుడు వచ్చేది ప్రాఫిట్ మాత్రమే.

శాటిలైట్, డిజిటల్, ఇంకా ఇతరత్రా ఆధాయాలు అన్నీకలిపి 40 కోట్లకు పైగానే వచ్చినట్లు తెలుస్తోంది. 48కోట్లు అని వినిపిస్తోంది కానీ, కన్ ఫర్మేషన్ లేదు. పోనీ 40 కోట్లే అనుకున్నా, అదంతా లాభంగా మిగిలినట్లే. గతంలో హారిక హాసిని ‘అజ్ఞాతవాసి’విషయంలో ఘోరంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత శైలజారెడ్డి అల్లుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా..లాభాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు అరవిందకు కూడా మంచి లాభాలు వచ్చాయి. మొత్తానికి ఈ ఏడాదికి ఇప్పటికి హారిక హాసిని రెండు సినిమాల మీద 50 కోట్ల వరకు లాభం కళ్లచూసినట్లే

‘అరవింద సమేత’అప్పుడే ఊపేస్తున్నాడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share