జబర్దస్త్ టీం రేట్లు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!

October 12, 2018 at 11:58 am

జబర్దస్త్… పరిచయం అక్కరలేని షో.. బుల్లితెరపై ఊరమాస్ కామెడీ షో.. యాంకర్, జడ్జెస్, స్కిట్లలో నటించే వాళ్లదాకా డైలాగ్స్ ను రాయలసీమ బాంబుల్లా పేల్చిపడేస్తారు. జనం మనోభావాలను పట్టించుకోకుండా హావభావాలను పలికే షో అనే విమర్శలు వచ్చిపడినా.. అదే జనాన్ని బుల్లితెర కు అతుక్కుని ఉండేలా చేసిన షో జబర్దస్త్. స్కిట్లు, డైలాగులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా.. అప్రతిహతంగా తన హవా కొనసాగిస్తున్న ఈ షోలో నటిస్తున్న వారికి జనంలో ఎంతో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో అడుగు పెట్టి.. టీమ్ లీడర్లు గా రాణించి, సినిమాల్లోనూ మెరుస్తున్నారు పలువురు. అయితే.. జబర్దస్త్ టీం లీడర్స్ కు, సభ్యులకు, జడ్జెస్ కు రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో తెలుసుకుంటే మన కళ్లు తిరగాల్సిందే. ఇప్పుడు జబర్దస్త్ నటులకు ఇల్లు, కార్లు ఉన్నాయి. సమాజంలో హోదా సంపాదించుకున్నారు.

jabardasth

ఈ షోకి జడ్జెస్ గా వ్యవహరించే నాగబాబు – రోజా ఒక్కొక్కరు 1.5 లక్షలు చొప్పున రెండేసి స్కిట్ లు రూపకల్పన చేస్తేనే అందుకుంటున్నారు. అదికూడా కేవలం రెండు రోజుల్లో మాత్రమే. ఇక ఈ షోను డైరెక్షన్ చేసే నితిన్-భరత్ ఇద్దరికి 1.5లక్షలు చొప్పున (రెండ్రోజుల షూట్ కి) అందుతాయట. ప్రస్తుతం ఈ షోలో ఆరు టీమ్ లు పని చేస్తున్నాయి. నిరంతర కామెడీ స్కిట్లతో నిరంతరం జబర్ధస్త్ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాయి. చమ్మక్ చంద్ర – హైపర్ ఆది – అదిరే అభి – రాకెట్ రాఘవ – వెంకీ – ఆర్పీ ఆరుగురు టీమ్ లీడర్లు. ఒక్కో టీమ్ కి రూ. 1.5లక్షలు ఎపిసోడ్ కి అందుతుంది. అయితే తోటి నటులకు తలో రూ.10వేలు ఇచ్చినా టీమ్ లీడర్ కి ఎంత లేదన్నా రూ.60-80 వేలు దాకా అందుతాయని చెప్పొచ్చు.

అయితే..మరో విషయం ఏమిటంటే.. రెండేసి స్కిట్ల ఎపిసోడ్లను కేవలం రెండ్రోజుల్లోనే పూర్తి చేస్తారట. ఇలా నిరంతరం వారంవారం ఎపిసోడ్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటాయి. దీంతో నే అర్థం చేసుకోవచ్చు.. వారి ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఈజీగా లెక్కలు వేయొచ్చు. దీనిని బట్టి జబర్దస్త్ షోతో అందులో నటిస్తున్న వారికి సమాజంలో గుర్తింపు కు గుర్తింపు.. డబ్బు కు డబ్బు వస్తోందని చెప్పొచ్చు. ఇక ఎక్ట్సా జబర్దస్త్ వేరు. దీని లెక్క వేరే ఉంటుంది. ఏదేమైనా.. జబర్దస్త్ షో తమ జీవితాల్లో వెలుగులు నింపిందని టీమ్ లీడర్లు, సభ్యులు చెబుతున్నారు. ఈ షో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు చెబుతున్నారు.

జబర్దస్త్ టీం రేట్లు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share