ప‌వ‌న్ వ‌ర్సెస్ బాల‌య్య వార్‌…. ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌

December 13, 2017 at 11:31 am
jai simha, ajnathavasi, balakrishna. pawan kalyan

టాలీవుడ్‌లో సంక్రాంతి వ‌స్తుందంటే మూడు, నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. గ‌త రెండు మూడేళ్లుగా సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో థియేట‌ర్ల కోసం పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. దీనికి తోడు బాక్సాఫీస్ వార్ కూడా ఆస‌క్తిగానే ఉంటోంది. రెండు మూడు సినిమాలు వ‌చ్చినా సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవుతుండ‌డం కూడా ఓ రికార్డుగా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే 2018 సంక్రాంతికి కూడా టాలీవుడ్‌లో ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ముందుగా రెడీ అయ్యాయి.

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన జైసింహా, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలు డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. అజ్ఞాత‌వాసి జ‌న‌వ‌రి 10న వ‌స్తుంటే, బాల‌య్య జైసింహా జ‌న‌వ‌రి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్న‌ట్టు చాలా సినిమాలే హ‌డావిడి చేశాయి. వాటిల్లో రాజ్ త‌రుణ్ రాజు  గాడు – ర‌వితేజ ట‌చ్ చేసి చూడు కూడా రిలీజ్‌కు రెడీ అయ్యాయి. 

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్ర‌కారం చూస్తుంటే ఈ రెండు సినిమాలు వెన‌క్కి వెళ్లిపోయినట్టే తెలుస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్పీడ్‌గా కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ సినిమాలు ఇంకా ఆ దిశ‌గా ఉన్న‌ట్టు లేవ‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. ఇక సంక్రాంతికి విశాల్ అభిమ‌న్యుడు వ‌స్తుంద‌నుకున్నా అది జ‌న‌వ‌రి 26కు వెళ్లిపోయింది. ఇక వ‌స్తే గిస్తే సూర్య గ్యాంగ్ మాత్ర‌మే రావొచ్చు. డ‌బ్బింగ్ సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా తెలుగు నుంచి మాత్రం సంక్రాంతికి పవన్-బాలయ్య పోరు మాత్రమే చూసేలా ఉన్నాం.

ప‌వ‌న్ వ‌ర్సెస్ బాల‌య్య వార్‌…. ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share