సినీవర్గాని షాక్ కి గురిచేసిన రాజమౌళి..!

November 18, 2018 at 1:38 pm

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఎంటో ప్రపంచానికి తెలియజేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. జానపద కథ, పౌరాణిక కథలను ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా చెప్పడం ఆయనలోని ప్రత్యేకత…నిత్యం సినిమాపై ఉండే ధ్యాస…విభిన్న ఆలోచనలే ఆయన్ను గొప్ప దర్శకుడిగా రూపొందించాయనడంలో సందేహం లేదు. ఇక తాజా విషయానికి వస్తే..ఆర్ ఆర్ ఆర్ పేరుతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు ఇతర తారాగణంతో ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..అయితే సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ శివారుల్లో భారీ సెట్ వేశారు. సగం షూటింగ్ ఇందులోనే పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సమయం సెట్లోనే గడపాల్సి వస్తుండటంతో అక్కడే ఓ మండువా ఇల్లు కూడా కట్టించేశారట. దాన్ని రాజమౌళి తన ఆఫీసులా వాడుకోబోతున్నారని తెలుస్తోంది.

ఓ గది ఎడిటింగ్ కోసం, మరో గది కాస్ట్యూమ్స్ కోసం ఉపయోగించనున్నారు. ఇంకొన్ని గదులు సెట్‌కి సంబంధించిన పరికరాలు, ప్రోపర్టీస్ కోసం కేటాయించారు. కథానాయకులు రామ్ చరణ్, ఎన్టీఆర్ కోసం కూడా రెండు గదులు ఉన్నాయట. తమ పాత్రలకు సంబంధించిన రిహార్సల్స్‌ను ఇందులో చేసుకోనున్నారు.ఇక సంగీత చర్చలు కూడా ఇక్కడే సాగనున్నాయట. మొత్తంగా సెట్‌నే ఇల్లుగా మార్చుకుని జక్కన్న అందరి ద`ష్టిని ఆకర్షించాడు. జక్కన్న అంకితాభావానికి, ఆలోచన విధానానికి, క్రియేటివిటికి ఈ సంఘటన నిదర్శనమని ఆయన అభిమానులు చెబుతున్నారు.

‘బాహుబలి’ కోసం కిలికి భాష సృష్టించారు రాజమౌళి. ఆ భాష, అందులోని పదాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కూడా అలాంటి కొత్త భాషని కనిపెట్టే పనిలో ఉన్నారు. కథ ప్రకారం అటవీ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం ఈ భాషని వాడతారని సమాచారం. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఈనెల 19 నుంచి మొదలుకానుంది. తొలుత యాక్షన్ దృశ్యాల్ని తెరకెక్కిస్తారు. ముగ్గురు కథానాయికలకు చోటుంది. అయితే.. ఆర్ ఆర్ ఆర్ అంటే రామ రావణ రాజ్యం అని అర్థమనే ప్రచారం జరుగుతోంది.

సినీవర్గాని షాక్ కి గురిచేసిన రాజమౌళి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share