‘కాలా’ ఫస్ట్ డే రికార్డుల వ‌ర్షం

June 8, 2018 at 10:15 am
Kaala, First Day Collections, Tamil Nadu, Rajini Kanth

తమిళనాట సూపర్ స్టార్ రజనీ క్రేజ్ ఏ స్థాయిదో చెప్పనక్కర్లేదు. ఆయ‌న తాజా చిత్రం కాలా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రికార్డుల వ‌ర్షం కురిపిస్తోంది. చెన్నై సిటీలో పాత సినిమాల రికార్డుల‌కు పాత‌రేసిన కాలా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రం చెన్నై సిటీలో రూ.1.76 కోట్ల గ్రాస్ రాబట్టింది.

కాలా దెబ్బ‌తో గతంలో విజయ్ సినిమా ‘మెర్సల్’ (తెలుగులో అదిరింది) పేరు మీదున్న రూ.1.52 కోట్ల రికార్డుని అధిగమించింది. ఓవర్సీస్‌లో కూడా కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసింది. ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ నిర్మించిన ఈ సినిమాకు క‌బాలి డైరెక్ట‌ర్ పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ముంబైలోని ధార‌వి మురికివాడ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న ఈశ్వ‌రీరావు, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా న‌టించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో నానా ప‌టేక‌ర్ విల‌న్‌గా న‌టించారు. ఇకపోతే సూపర్ స్టార్ నిన్ననే తన కొత్త సినిమా చిత్రీకరణను మొదలుపెట్టారు.

‘కాలా’ ఫస్ట్ డే రికార్డుల వ‌ర్షం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share