‘ కాలా ‘ ప్రి రిలీజ్ టాక్‌… సినిమా ఎలా ఉందంటే…

June 5, 2018 at 9:26 am
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా వ‌స్తుందంటే వారం రోజుల ముందు నుంచే ఎలాంటి హ‌డావిడి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌మిళ‌నాడు అయితే అభిమానుల హ‌డావిడితో హోరెత్తిపోతుంది. తెలుగులోనూ ర‌జ‌నీ సినిమాకు అంతే రేంజ్‌లో బ‌జ్ ఉంటుంది. అయితే ఆయ‌న తాజా చిత్రం కాలా విష‌యానికి వ‌స్తే ఈ నెల 7న ఆ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే టైం ఉంది. అయితే ర‌జ‌నీ సినిమా వ‌స్తుంద‌న్న విష‌య‌మే చాలా మందికి గుర్తు లేదు.
 
కాలా రిలీజ్ అవుతుంద‌న్న విష‌యం చాలా మందికి గుర్తులేదు… అనే కంటే ఈ సినిమాపై బ‌జ్ ఏ మాత్రం లేదు. చాలా పూర్ బ‌జ్‌తో కాలా రిలీజ్ అవుతోంది. మ‌రో షాక్ ఏంటంటే ర‌జ‌నీ సినిమాకు తెలుగులో కూడా క‌నీసం ఆరు నెల‌ల ముందే డ‌బ్బింగ్ రైట్స్ అమ్ముడు అవుతాయి. కాలా సినిమాను ఇక్క‌డ కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఓన్ రిలీజ్‌కు రెడీ అయ్యారు.
 
కాలాకు అనుకున్న రేంజ్‌లో ఇక్క‌డ థియేట‌ర్లు కూడా దొరికే ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ సినిమాకు వ‌సూళ్లు త‌గ్గితేనే థియేట‌ర్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు త‌ప్పా…. ప్ర‌త్యేకంగా ర‌జ‌నీ సినిమా వ‌స్తుంద‌ని ఇక్క‌డ వ‌సూళ్ల‌తో ఉన్న సినిమాల‌ను తీసేసేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీనికి కార‌ణం కాలా మీద ఎవ్వ‌రికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే. ర‌జ‌నీ గ‌త చిత్రాలు విక్ర‌మ‌సింహుడు, లింగా, క‌బాలి ఇక్క‌డ డిజాస్ట‌ర్లు అయ్యి బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేశాయి. 
 
ఇప్పుడు కాలా నిర్మాత‌లు కూడా ఈ సినిమాకు ఇక్క‌డ ఎక్కువ రేటు ఆశించారు. దీంతో వాళ్లు ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వాళ్లు సొంతంగా రిలీజ్ చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా చాలా పూర్‌గా ఉన్నాయి. పైగా ఈ సినిమా ద‌ర్శ‌కుడు పా.రంజిత్ క‌బాలి లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాడు… ఇప్పుడు అదే ద‌ర్శ‌కుడు, కాస్త అటూ ఇటూగా అదే మాఫియా క‌థ‌తో వ‌స్తుండ‌డం ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. ఏదేమైనా కాలా పూర్ బ‌జ్‌తో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
‘ కాలా ‘ ప్రి రిలీజ్ టాక్‌… సినిమా ఎలా ఉందంటే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share