కాలా డీలా… వసూళ్ల లెక్క ఇదే

June 9, 2018 at 11:07 am
Kaala, Rajini Kanth, Collections, world wide, First Day

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలా ఫ‌స్ట్ డేకే తేలిపోయింది. క‌బాలి డైరెక్ట‌ర్ రంజిత్ ద‌ర్శ‌క‌త్వం చేసిన సినిమా కావ‌డంతో పాటు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు అంతంత మాత్రంగానే ఉండ‌డంతో కాలాకు ముందు నుంచి మంచి అంచ‌నాలు లేవు. ఎలాగోలా వాయిదాలు ప‌డి చివ‌ర‌కు థియేట‌ర్ల‌లోకి దిగిన కాలాకు తెలుగునాట మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ఇంకా చెప్పాలంటే కాలా మ‌న వాళ్ల‌కు క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు కూడా లేవు.

సినిమా క‌థ కొత్తది కాక‌పోవ‌డం, స్లో నెరేష‌న్‌, ర‌జ‌నీ హీరోయిజం మిస్ అవ్వ‌డం, సెకండాఫ్ మ‌రీ త‌ల‌పోటుగా మారిపోవ‌డం కాలాకు బిగ్గెస్ట్ మైన‌స్‌లు అయ్యాయి. క‌బాలి కంటే కాలా బెట‌ర్ అని కొంద‌రు చెపుతున్నా వ‌సూళ్ల‌లో మాత్రం తేలిపోయింది. సినిమా న‌చ్చ‌ని వాళ్లు కాలా కిల్‌…. క‌లెక్ష‌న్లు నిల్ అని నెట్టింట్లో జోకులు కూడా పేల్చుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే క‌లెక్ష‌న్లు ఉన్నాయి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలాకు కేవ‌లం 3.24 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ర‌జ‌నీ సినిమాకు ఎప్పుడో 8 ఏళ్ల క్రిత‌మే ఇక్క‌డ రూ.35 కోట్ల మార్కెట్ ఉంది. ఇప్పుడు కాలా వ‌సూళ్లు చూస్తే ఈ సినిమా ఎంత ఘోర‌మైన ప్లాప్ అవ్వ‌బోతోందో క్లారిటీ వ‌చ్చేసింది.

ఏరియాల వారీగా కాలా ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.. (రూ.కోట్ల‌లో)
నైజాం – 1.25
సీడెడ్ – 0.44
నెల్లూరు – 0.13
కృష్ణా – 0.26
గుంటూరు – 0.40
వైజాగ్ – 0.31
ఈస్ట్ – 0.25
వెస్ట్ – 0.20
————————————-
ఏపీ + తెలంగాణ = 3.24 కోట్లు
————————————-

కాలా డీలా… వసూళ్ల లెక్క ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share