రిలీజ్ రోజే ‘కాలా’ రికార్డులు బద్దలు కొట్టాడు

June 7, 2018 at 11:46 am
Kaala, Rajini Kanth, Records, Social Media, movie, leaked

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు. రికార్డుల రారాజుగా ర‌జ‌నీకి పేరుంది. ర‌జ‌నీ తాజా చిత్రం కాలా వాస్త‌వంగా చూస్తే ఫూర్ బ‌జ్‌తోనే స్టార్ట్ అయ్యింది. ర‌జ‌నీకి ఉన్న క్రేజ్‌తో పోలిస్తే కాలా రిలీజ్‌కు ముందు జ‌రిగిన హ‌డావిడి పెద్ద గొప్ప‌గా లేదు. కాలా గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కాలాకు ర‌జ‌నీ గత సినిమాల‌లా ముంద‌స్తు బుకింగ్‌లు భారీగా లేక‌పోయినా ఈ సినిమా ఓ రికార్డు కొట్టేసింది.

కాలా రికార్డు క‌లెక్ష‌న్ల‌లో కాదు ఫైర‌సీలో రికార్డు బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌స్తుతం ఓ సినిమా రిలీజ్ అయిన నాడే గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఫైర‌సీ ఫ్రింట్లు వ‌చ్చేస్తున్నాయి. అయితే కాలా సినిమా ఇండియాలో ఇంకా రిలీజ్ కాకుండానే ఫేస్‌బుక్ లైవ్‌లో టెలీకాస్ట్ అయ్యి ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఫైర‌సీలో కూడా ఇదో రికార్డుగా నిలిచింది.

కాలా సినిమాను సింగ‌పూర్‌లోనే కాథే సినీఫ్లెక్స్‌లో 6వ తేదీనే ప్రీమియ‌ర్ వేశారు. ఈ సినిమాకు వెళ్లిన ప్రవీణ్ తేవర్ అనే నెటిజన్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో కాలా సినిమా స్టార్టయిన క్షణం నుంచే లైవ్ లో సినిమా చూపించడం మొదలెట్టాడు. ఇలా మొదటి 40 నిమిషాల సినిమా అత‌డు లైవ్ ఇవ్వ‌డంతో ఆ సినిమాను చాలా మంది చూసేశారు.

ఈ విష‌యం ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు తెలియ‌డంతో వాళ్లు తమిళ నటుల సంఘం అధ్యక్షుడు – హీరో విశాల్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంట‌నే రంగంలోకి దిగిన విశాల్ పోలీసుల‌తో మాట్లాడి ఈ లైవ్ ఇచ్చిన ప్ర‌వీణ్ తేవర్ ను అరెస్టు చేయించాడు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. ఏదేమైనా ఫైర‌సీలో కూడా ర‌జ‌నీ త‌న‌కంటూ కొత్త రికార్డు క్రియేట‌ట్ చేసుకున్నాడు.

రజినీకాంత్ ‘కాలా’ రివ్యూ రేటింగ్

రిలీజ్ రోజే ‘కాలా’ రికార్డులు బద్దలు కొట్టాడు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share