నాగ్ ముంచాడు..రజినీ రెడీ అయ్యాడు

June 5, 2018 at 11:05 am

ర‌జ‌నీకాంత్ కాలా సినిమా వ‌స్తోంది… సినిమాపై ఎవ్వ‌రికి ఎలాంటి అంచ‌నాలు లేవు. అస‌లు కాలా ర‌జ‌నీ సినిమాయేనా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. దీనిని బ‌ట్టి కాలా ప‌రిస్థితి ఏంటో… రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోందో చాలా మందికి ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లుంది. ర‌జ‌నీ సినిమా అంటే ముంద‌స్తు బుకింగ్‌లు… ఫ్లెక్సీలు… హ‌డావిడి అదిరిపోవాలి… కాలాకు అదేం లేదు. తెలుగులో బిజినెస్ జ‌ర‌గ‌లేదు… దీంతో లైకా వాళ్లు ఓన్ రిలీజ్ చేస్తున్నారు.

ర‌జ‌నీ సినిమాల‌కు ఉండే హైప్ చూసి బ‌య్య‌ర్లు భారీగానే రిస్క్ చేస్తుంటారు. ఇప్పటికే మూడు సినిమాల‌తో భారీగా దెబ్బ‌తిని ఉండ‌డంతో కాలా విష‌యంలో ఎవ్వ‌రూ ఈ సినిమా కొనే రిస్క్ చేయ‌లేదు. ర‌జ‌నీ గ‌త సినిమాల రేంజ్‌లో కాక‌పోయినా బ‌య్య‌ర్లు ఎంతో కొంత ఎక్కువ మొత్తాల‌కే ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాలా రూ.20 కోట్ల బిజినెస్‌తో స్టార్ట్ అవ్వ‌డ‌మే పెద్ద గొప్ప‌.

అయితే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్‌ల‌లో కాలా తేలిపోయింది. కర్ణాట‌క‌లో బ‌య్య‌ర్లు భారీ రేట్ల‌కు కొన్నారు. అక్క‌డ సినిమాను రిలీజ్ కానివ్వ‌మ‌ని చెపుతున్నారు. సినిమాపై బ‌జ్ లేదు… నెగిటివ్ టాక్ వ‌స్తే బ‌య్య‌ర్లు మ‌ళ్లీ నిండా మున‌గ‌డ‌మే. సేమ్ టు సేమ్ ఈ శుక్రవారం వ‌చ్చిన నాగార్జున – వ‌ర్మ ఆఫీస‌ర్ కూడా ఇలాంటి ప‌రిస్థితుల్లోనే, ఇలాంటి బ‌జ్‌తోనే రిలీజ్ అయ్యింది. నాగ్ ఏకంగా రూ.10 కోట్ల‌కు పైగా బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేశాడు. ఇప్పుడు కాలాకు కూడా అదే ప‌రిస్థితి వ‌స్తే బ‌య్య‌ర్ల నెత్తిన పెద్ద గుది బండ అవ్వ‌డం ఖాయం.

నాగ్ ముంచాడు..రజినీ రెడీ అయ్యాడు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share