బజ్ లేని కాలాకు కళ్ళుచెదిరే రైట్స్

June 6, 2018 at 4:57 pm

వరుస డిజాస్టర్స్ తో రజినీకి తెలుగులో డిమాండ్ తగ్గిందన్న మాట వాస్తవం, ఎందుకంటే రజిని తీసిన గత మూడు సినిమాలు కొచ్చాడియాన్, లింగా, కబాలి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడి బయ్యర్ లకు భారీ లాస్లు మిగిల్చాయి. ఈ దెబ్బతో రజిని అంటేనే బాబోయ్ మాకొద్దు అనే రేంజ్ కు వచ్చారు, మరి ఇలాంటి టైమ్ లో కాలా ఎలా అమ్ముడు పోతుంది అని అనుకున్నారు అందరు.

కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కాలా తెలుగు రైట్స్ 30 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ డీల్ మొత్తం అడ్వాన్స్ బేసిస్ మీదే జరగడం ఒక ఇంత ఆశ్చర్యమే….మూడు డిజాస్టర్స్ వచ్చిన రజినీని నమ్మి ఇంత మొత్తంలో పెట్టడం అంటే భారీ రిస్క్ చేసినట్టే. దీంతో జనానికి ఒకటి బోధపడింది బజ్ లేనిది కాలాకు..సూపర్ స్టార్ కు కాదు అని, అందులోను రజిని స్వయానా వచ్చి ప్రమోషన్స్ లో పాలుగుంటం ఒక ఇంత ఆశ్చర్యమే ఎందుకంటే అల్లుడు ధనుష్ నిర్మాణంలో వస్తుంది కాబట్టి. మరి ఇంత అంచనాల మధ్య వస్తున్న రజిని సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

బజ్ లేని కాలాకు కళ్ళుచెదిరే రైట్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share