‘కాళి’ ట్రైల‌ర్ తో మెప్పించిన బిచ్చగాడు

March 16, 2018 at 7:03 pm
Kaali - Official Trailer, Vijay antony, Anjali

బిచ్చ‌గాడు సినిమాకు ముందు విజ‌య్ ఆంటోనీ తెలుగు ప్రేక్ష‌కుల్లో చాలా మందికి తెలియ‌దు. డాక్ట‌ర్ స‌లీమ్ సినిమాతో పాటు కొన్ని డ‌బ్బింగ్ సినిమాల‌కు మ్యూజిక్ ఇచ్చిన విష‌య‌మే తెలుసు. బిచ్చ‌గాడు సినిమాతో ఒక్క‌సారిగా తెలుగులో విజ‌య్ ఆంటోనీ ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగులో ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా రిలీజ్ అయ్యి ఏకంగా 55 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో పాటు 35 కోట్ల షేర్ రాబ‌ట్టి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది. 

 

ఈ సినిమా త‌ర్వాత విజ‌య్‌కు తెలుగులో తిరుగులేని గుర్తింపు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి విజ‌య్ త‌మిళ్ సినిమాలు అన్ని తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. బిచ్చ‌గాడు తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి నాలుగు సినిమాల దాకా వచ్చాయి కానీ.. అవన్నీ తుస్సుమనిపించాయి. బేతాళుడు, ఇంద్ర‌సేన లాంటి సినిమాలు డిజాస్ట‌ర్లే అయ్యాయి. ఇంద్ర‌సేన అయితే అత‌డి తెలుగు మార్కెట్ పూర్తిగా తుస్సుమ‌నేలా చేసింది. 

 

ఈ క్ర‌మంలోనే విజ‌య్ కొత్త సినిమా కాళిని తెలుగులో రిలీజ్ చేద్దామా ? వ‌ద్దా ? అన్న సందిగ్ధంలో ఉన్నాడు విజ‌య్‌. విజ‌య్ గ‌త సినిమాల‌కు తెలుగులో ముందే బిజినెస్ అయ్యింది. ఇక్క‌డ కూడా త‌మిళ్‌కు పోటీగా ప్ర‌మోష‌న్లు చేశారు. కానీ కాళి విష‌యంలో అలా జ‌ర‌గ‌డం లేదు. ఈ సినిమాను కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతోనే త‌మిళంలో మాత్ర‌మే రిలీజ్ చేసేలా అక్క‌డ ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

 

ఇక కాళి ట్రైల‌ర్ చూసినా కూడా త‌మిళ వాస‌న‌లు జోరుగా గుప్పుమంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ రిలీజ్ చేసినా ఉప‌యోగం లేద‌నుకున్నారో ?  ఏమోగాని ? ఇక్క‌డ వాళ్ల ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టే బిజినెస్ కూడా జ‌ర‌గ‌డం లేదు. ఏదేమైనా బిచ్చ‌గాడితో మెరిసిన విజ‌య్ అప్పుడే తెలుగులో దుకాణం బంద్ చేసిన‌ట్టే ఉన్నాడు.  ముందుగా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేద్దామని ఒక పాట కూడా రిలీజ్ చేశారు, పాపం విది వక్రయించి పాట తోనే సరిపెట్టారు. 

 

‘కాళి’ ట్రైల‌ర్ తో మెప్పించిన బిచ్చగాడు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share