టాలీవుడ్ యంగ్ హీరోతో కాజ‌ల్ ప్రేమాయ‌ణం..!

గ‌తేడాది కాజ‌ల్ న‌టించిన సినిమాల‌న్ని వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు అయ్యాయి. ప‌వ‌న్‌తో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, మ‌హేశ్‌తో బ్ర‌హ్మోత్స‌వం ఇలా చెప్పుకుంటూ పోతే కాజల్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్ర‌ప‌డిపోయింది. ఈ యేడాది నుంచి మాత్రం ఆమె ద‌శ దిశ తిరిగిపోయింది. మెగాస్టార్ చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో హిట్ కొట్టిన కాజ‌ల్‌కు ఇప్పుడు టాప్ హీరోల ప‌క్క‌న అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

అజిత్ వివేగం, విజ‌య్ మెర్స‌ల్ (తెలుగులో అదిరింది), తెలుగులో రానా స‌ర‌స‌న నేనే రాజు – నేనే మంత్రి, క‌ళ్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యే లాంటి సినిమాల్లో ఆమె న‌టిస్తోంది. ఇదిలా ఉంటే కాజ‌ల్‌పై కొద్ది రోజులుగా  వ‌దంతులు ప్ర‌చారంలో ఉన్నాయి. ఆమె ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడిని ప్రేమిస్తోంద‌ని, వారిద్ద‌రూ తరచూ రహస్యంగా కలుసుకుంటున్నారనీ టాక్. 

అలాగే ఆమె ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఈ ప్ర‌చారంపై కాజ‌ల్ చాలా ఘాటుగా రిప్లే ఇచ్చింది. త‌న ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్పచారాన్ని చేస్తున్నారు. ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని ఆమె ఫైర్ అయ్యింది.

ఇక తాను అగ్ర‌హీరోల‌తోనే న‌టిస్తాన‌ని, త‌న స్థానాన్ని ఎవ్వ‌రూ క‌ద‌ప‌లేరంటూ ఆమె సీరియ‌స్ అయ్యారు. మ‌రి కాజ‌ల్ త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని చెప్పింది….ఆమెపై కుట్ర చేసే వారు ఎవ్వ‌ర‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. అలాగే ఆమె ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆ టాలీవుడ్ హీరో ఎవ‌ర‌న్న‌ది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.