మెగా అల్లుడికి అది సాధ్యమేనా…!

July 14, 2018 at 10:39 am
Kalyan Dev, Megastar chiranjeevi, Mass image, Movies

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఓ ప్రత్యేకత ఉండాలని చూస్తుంటారు అభిమానులు, ఫ్యాన్స్. ముఖ్యండా డ్యాన్స్, ఫైట్స్, ఊరమాస్ యాక్షన్..ఇదీ ఉంటేనే మెగా హీరో అవుతారని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటారు. వాస్తవానికి మెగాస్టార్ కి ఎక్కువ శాతం మాస్ ఫాలోయింగ్ ఉంది..అందుకే ఆయన వారసులుగా వచ్చిన వారు సైతం ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటారు.

తాజాగా ‘విజేత’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్ ఓ మద్యతరగతి కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాలో నటించాడు. వాస్తవానికి ఈ సినిమాలో ఫుల్ లెన్త్ మాస్ పండించొచ్చు..కానీ ఆ రేంజ్ కి ఈ కొత్త హీరో చేరలేదని అభిప్రాయం. దాంతో తాను నటించబోయే కొత్త సినిమాపై మొత్తం దృష్టి పెట్టాడు. అవును.. కల్యాణ్ దేవ్ నెక్ట్స్ సినిమా ఊర మాస్ మూవీనట.

అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. ఇలా మెగా కాంపౌండ్ లో చాలామంది మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ బన్నీ, చరణ్ రేంజ్ లో వీళ్లకింకా ఆ ఇమేజ్ దక్కలేదు. భవిష్యత్తులో దక్కే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వీళ్లకు కల్యాణ్ దేవ్ తోడయ్యాడు.

ఇక కళ్యాన్ దేవ్ విషయానికి వస్తే.. మాస్ అప్పీల్ మచ్చుకైనా కనిపించదు. చూడ్డానికి సింపుల్ గా సాఫ్ట్ గా ఉంటాడు. సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంది. ఫైట్స్ ఇరగదీయాలి, మాస్ డైలాగ్స్ చెప్పాలి. అందుకే రెండో సినిమాతో మాస్ రుద్దుడుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ దేవ్. తన రెండో సినిమాతో పాటు, దర్శకుడి వివరాలు మరో 10 రోజుల్లో వెల్లడించబోతున్నాడు.

మెగా అల్లుడికి అది సాధ్యమేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share