నమ్మకం కోల్పోయిన కళ్యాణ్ రామ్ ..అంతా అయోమయం

June 19, 2018 at 6:40 pm
Kalyan ram, career, Naa movie, result, movies

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో బాలకృష్ణ, హరికృష్ణ. కొన్ని సినిమాలు తీసిన తర్వాత హరికృష్ణ రాజకీయాల్లోకి వెళ్లగా..బాలకృష్ణ మాత్రం సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక హరికృష్ణ తనయుడు కళ్యాణ్‌ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నారు. కళ్యాన్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ..నిర్మాతగా కొన్ని సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇటీవ‌ల‌ బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాకు కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ఇప్పటి వరకు కళ్యాన్ రామ్ యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ తరహా సినిమాల్లో నటిస్తు వచ్చారు. కాకపోతే ‘పటాస్’ సినిమా తర్వాత మనోడికి బ్యాడ్ టైమ్ వెంటాడుతుంది. ఎప్పుడు యాక్షన్ తరహా సినిమాలు కాకుండా రొమాంటిక్ లుక్ తో ఎలా ఉంటుందన్న ప్రయోగం చేశాడు కళ్యాణ్‌ రామ్..కానీ సక్సెస్ కాలేక పోయాడు. రీసెంట్ గా వచ్చిన ‘నా నువ్వే’ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. కళ్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉన్నా సినిమాలో విషయం తక్కువగా ఉండటంతో నానువ్వే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అది కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ అనే ముద్ర కూడా సంపాదించుకుంది. అంతకు ముందు కాజల్ తో వచ్చిన ఎమ్మెల్యే కాస్తో కూస్తో ఫన్నీ, మెసేజ్ తరహా ఉన్నా..‘నా నువ్వే’ లో ఏవీ లేకపోవడం అభిమానులను నిరుత్సాహ పరిచింది. కొత్తదనంతో ఉండేలా సినిమా చేస్తే మరి ఇంత దారుణమైన రిజల్ట్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేదని ఆవేదనతో ఉన్నాడట. ఆసినిమా రూ. 15 కోట్ల దాకా వసూలు చేసింది.

దీంతో రూ. 10 కోట్లు – రూ. 15 కోట్ల రేంజ్ హీరోల్లో కళ్యాణ్ రామ్ కొనసాగుతాడని అంతా భావించారు. తరవాత వచ్చిన షేర్ – ఇజం – ఎం.ఎల్.ఎ. వరసగా మూడూ పరాజయం పాలయ్యాయి. ఈ ఎఫెక్ట్ ‘నా నువ్వే’ పై పడింది..దాంతో అతితక్కువ కలెక్షన్లే వచ్చాయి. ఈసారి కళ్యాణ్‌ రామ్ మరో ‘పటాస్’ లాంటి సినిమాతో వస్తేనే సక్సెస్ అవుతాడని లేదంటే కెరీర్ సంక్షోభంలో పడే అవకాశం ఉందని ఫిలిమ్ వర్గాలు అంటున్నారు.

నమ్మకం కోల్పోయిన కళ్యాణ్ రామ్ ..అంతా అయోమయం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share