ఎన్టీఆర్ ఛాలెంజ్ కు కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే

June 2, 2018 at 8:52 pm
Kalyan ram, HumFitTohIndiaFit, NTR, Challenge

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎక్కడ విన్న ఏ సోషల్ మీడియాలో చూసిన ఒకే మాట ఒకే ఛాలెంజ్ అదే ‘ హమ్ ఫిట్ తొహ్ ఇండియా ఫిట్’. కోహ్లీ మోడీని ఛాలెంజ్ చేస్తూ ట్రెండ్ అయిన ఈ వైరల్ ఇప్పుడు సినిమా వాళ్ళ మధ్య నలుగుతుంది. ఈ మధ్యన మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తన ఫిట్ నెస్ వీడియోని సోషల్ మీడియా లో షేర్ చేసాడు దానిని ఎన్టీఆర్ కు టాగ్ చేసి ఛాలెంజ్ విసిరాడు. తారక్ ఊరుకుంటాడా తాను కూడా ఛాలెంజ్ కు రెడీ అని చెప్పి తన జిమ్ వర్క్ ఔట్స్ ని కెమెరాలో బందించి ట్విట్టర్ లో పెట్టాడు. ఆ వీడియోని తారక్ మరికొంత మంది హీరోలకు టార్గెట్ చేస్తూ ఛాలెంజ్ విసిరాడు, ఆ ఛాలెంజ్ లో ఎవరెవరు ఉన్నారంటే తన అన్న కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, రాంచరణ్ ఉన్నారు.

ఇప్పుడు తారక్ ఛాలెంజ్ ను ఆహ్వానిస్తూ తన అన్న కళ్యాణ్ రామ్ తాను రోజు చేసే వర్క్ ఔట్స్ ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ను, అల్లు అర్జున్ టాగ్ చేసి ఛాలెంజ్ విసిరాడు.

ఎన్టీఆర్ ఛాలెంజ్ కు కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share