క‌ళ్యాణ్‌రామ్ సినిమాకు ఇంత క్రేజేంటి…

May 4, 2018 at 11:13 am
Kalyan Ram, tamanna, Naa Nuvve, satilight rights

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ హిట్ జోష్‌ను కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. షేర్‌, ఇజం సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. నిర్మాత‌గా సోద‌రుడు ఎన్టీఆర్‌తో తీసిన జై ల‌వ‌కుశ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో ఎం.ఎల్‌.ఏ సినిమాతో యావ‌రేజ్ సినిమా ఇచ్చాడు. ఎం.ఎల్‌.ఏ హిట్ అవ్వ‌క‌పోయినా జ‌స్ట్ ఓకే అనిపించుకుంది. ఇక క‌ళ్యాణ్ రెండు నెల‌ల గ్యాప్ లోనే మ‌రోసారి నా నువ్వేతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

 

షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ అయిన జ‌యేంద్ర గ‌తంలో సిద్ధార్థ్ హీరోగా వ‌చ్చిన 180 ఈ వ‌య‌స్సు ఇక రాదు సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు బుల్లి తెర బిజినెస్‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి రేటు ప‌లుకుతోంది. ఈ సినిమా సెట్లో ఉన్న‌ప్పుడే శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ అమ్ముడైపోయాయి. జెమిని టీవీ రూ.4.75 కోట్ల‌తో శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. హిందీ రైట్స్ రూపంలో మ‌రో రూ.3 కోట్లు వ‌చ్చాయి. డిజిట‌ల్ రైట్స్ రూపంలో మొత్తంగా రూ.8 కోట్ల వ‌ర‌కూ త‌న ఖాతాలో వేసుకుందీ సినిమా. 

 

ఇక మిల్కిబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ కావ‌డం, టెక్నిక‌ల్‌గా పీసీ శ్రీ‌రామ్ లాంటి వాళ్ల స‌పోర్ట్ దొర‌క‌డంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడే బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది. చాలా ఏరియాల్లో క‌ళ్యాణ్ గ‌త సినిమాల కంటే మంచి రేటు ప‌లుకుతోంది. క్లాస్ మూవీగా తెర‌కెక్కుతోన్న నా నువ్వే హిట్ అయితే క‌ళ్యాణ్ రేంజ్ మ‌రింత పెరుగుతుంది. మ‌రి నా నువ్వేతో క‌ళ్యాణ్ ఏం చేస్తాడో తెలియాలంటే ఈ నెల 25 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

క‌ళ్యాణ్‌రామ్ సినిమాకు ఇంత క్రేజేంటి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share