స‌ర్దార్ రూట్లో కాట‌మ‌రాయుడు 

February 23, 2017 at 5:12 am
Pawan Kalyan

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు షూటింగ్ తీరు చూస్తుంటే ప‌వ‌న్ చివ‌రి చిత్రం స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ షూటింగ్‌ను త‌ల‌పిస్తోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. కాట‌మ‌రాయుడు షూటింగ్ విష‌యంలో ముందునుంచి ప్లానింగ్‌తో లేరు. తీరా ఇప్పుడు ఉగాదికి రిలీజ్ డేట్ ఇవ్వ‌డంతో షూటింగ్‌ను హ‌డావిడిగా ఫినిష్ చేసేందుకు కంగారు ప‌డుతున్నారు.

కాట‌మ‌రాయుడు సినిమా చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. అయితే కొన్ని సీన్లు ప‌వ‌న్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో రీ షూట్లు చేయాల‌ని ద‌ర్శ‌కుడు డాలీని ఆదేశించాడ‌ట‌. ఇక పాట‌లు కూడా బ్యాలెన్సింగ్ ఉన్నాయి. ఈ పాట‌ల‌ను కేవ‌లం 10 రోజుల్లో లేపేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. 10 రోజుల్లో మూడు పాట‌ల‌ను షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశార‌ట‌.

గ‌తంలో స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ విష‌యంలో కూడా ముందు తాయితీగా షూటింగ్ చేసిన యూనిట్ చివ‌ర్లో రెండు మూడు యూనిట్ల‌ను పెట్టి సినిమాను స్పీడ్‌గా ఫినిష్ చేసేసింది. తీరా రిజ‌ల్ట్ బొక్క‌బోర్లా ప‌డింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూడు పాట‌ల‌తో పాటు ఉండే నాలుగో పాట‌ను ఇక్క‌డే సెట్ వేసి తీస్తార‌ట‌.

ఏదేమైనా షూటింగ్‌ను ముందుగా చాలా స్లోగా చేసి..చివ‌ర‌కు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి హ‌డావిడి చేయ‌డం ప‌వ‌న్ సినిమాల‌కు కామ‌న్ అయిపోయింది. ఇక్క‌డే ఏ మాత్రం తేడా జ‌రిగినా …రిజ‌ల్ట్ తేడా కొట్టేస్తుంది.

 

స‌ర్దార్ రూట్లో కాట‌మ‌రాయుడు 
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share