కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు

July 9, 2018 at 11:29 am
Kathi Mahesh, Hyderbad Police, Ban, Sensational comments on hindu community

ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతున్న నేపథ్యంలో సెలబ్రెటీలు ఏ విషయంలోనూ చాలా ఆచీ తూచీ..వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరికొంత మంది చీఫ్ ట్రిక్స్ ప్రయోగిస్తూ తమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ..సంచలనం సృష్టి పాపులారిటీ సంపాదించాలని చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 తో పరిచయం అయిన కత్తి మహేష్ తర్వాత పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఎపిసోడ్ దాదాపు నాలుగు నెలల పాటు సాగింది.

ఇదిలా ఉండగా ఈ మద్య హిందువులో ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. పలు చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా కత్తి మహేష్ పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన పోలీసులు క‌త్తిని న‌గ‌రం బ‌య‌ట వ‌దిలేసి.. త‌మ అనుమ‌తి లేకుండా మ‌ళ్లీ రావ‌ద్ద‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.

ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.టీవల ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీరాముని కత్తి మహేష్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share