నోరు పారేసుకున్న కోహ్లీ..

November 8, 2018 at 12:38 pm
Kohli, losing perspective, Twitter, Sensational Comments

ఆట‌లో దూకుడు.. మాట‌లో దురుసు.. ఇదీ ఇప్పుడు ప్ర‌ముఖ క్రికెట‌ర్ కోహ్లీకి టాగ్‌లైన్‌గా మారింది. ఆట అన్న‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విమ‌ర్శ వ‌స్తూనే ఉంటుంది. ఇలాంటివాటిని లైట్‌గా తీసుకోకుండా.. మ‌న కోహ్లీ రెచ్చిపోయాడు. స‌ద‌రు వ్య‌క్తిని ఏకంగా దేశం విడిచి వెళ్ల‌మ‌ని అన్నాడు. ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందో చూద్దాం.. కోహ్లీ కెరీర్ మొద‌ట్లో ఇలాగే దూకుడైన తీరుతో విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. క్ర‌మంలో దానిని త‌గ్గించుకుని ఆట‌పై ద‌`ష్టి పెట్టి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్పుడు ఓ విష‌యంలో మ‌ళ్లీ రెచ్చిపోయాడు.

ఒక మొబైల్ యాప్ లో కొహ్లీ కామెంట్లు వివాదస్పదం అవుతున్నాయి. ఇటీవ‌ల కోహ్లీపేరు మీద ఒక మొబైల్ యాప్ స్టార్ట్ అయింది. దానిలో ఓ వ్య‌క్తి కొహ్లీని విమర్శించాడు. కొహ్లీ గొప్ప బ్యాట్స్ మన్ ఏమీ కాదని.. అతడి కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు గొప్పోళ్లని ఆ వ్య‌క్తి కామెంట్ చేశాడు. దీంతో కోహ్లీ అత‌డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అత‌డి అభిమానం తనకు అవసరం లేదని అంటూ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు న‌చ్చితే.. ఇండియాలో ఉండవద్దని, ఆ దేశాలకు వెళ్లిపోవాలని కొహ్లీ దురుసుగా వ్యాఖ్యానించాడు. అంతేగాకుండా.. విదేశీ ఆట‌గాళ్ల‌ను అభిమానించే వాళ్లు ఈ దేశానికి స‌రిపోర‌ని కూడా కోహ్లీ అన్నాడు. ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి.

ఎవ‌రో ఒక వ్య‌క్తి చేసిన కామెంట్ల‌పై కోహ్లీ ఇంత‌లా రెచ్చిలాపోవాల్సిన ప‌నిలేద‌ని, దేశం విడిచి వెళ్లిపొమ్మ‌న‌డానికి ఆయ‌నెవ‌రి ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎవరు దేశంలో ఉండాలో.. ఎవరు దేశం విడిచి వెళ్లాలో చెప్పడానికి కోహ్లీ ఎవ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ క్రికెట‌ర్ ఇటీవ‌ల చెప్పిన విష‌యాల‌ను ఇక్క‌డ ప్ర‌సావిస్తున్నారు. తామంతా డబ్బు తీసుకునే ఆడుతున్నామని.. అలాంటిది తమది దేశభక్తి ఏంటని ఆ బంగ్లా క్రికెట‌ర్ ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పాడ‌ని.. ఈ విష‌యాన్ని కోహ్లీ కూడా గుర్తుంచుకుంటే మంచిద‌ని ప‌లువురు చుర‌క‌లు అంటిస్తున్నారు. ఏదేమైనా.. కోహ్లీ కొంచెం దూకుడు త‌గ్గించుకుంటే మంచిదేమో..!

నోరు పారేసుకున్న కోహ్లీ..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share