మ‌హాన‌టిపై కేటీఆర్ రివ్యూ

May 10, 2018 at 11:21 am
KTR, Mahanati, movie, review, keerthi suresh

దివంగ‌త లెజెండ్రీ హీరోయిన్ సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమా ఈ బుధ‌వారం రిలీజ్ అయ్యి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఫ‌స్ట్ షో అయిన వెంట‌నే అటు విమ‌ర్శ‌కులు, క్రిటిక్స్‌తో పాటు ఇటు ప్రేక్ష‌కుల నుంచి కూడా అద్భుత‌మైన టాక్ వ‌చ్చింది. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా మ‌హాన‌టి వెళుతోంది. ఈ సినిమాకు ఇండ‌స్ట్రీతో పాటు సామాన్య జ‌నాలు, ప్రేక్ష‌కులు, అంద‌రు హీరోల అభిమానుల నుంచే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల నుంచి కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

 

ఇక ఈ సినిమాను చూసిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇక ఇటీవ‌ల ప‌లు సినిమాలు చూసి ప్ర‌శంస‌లు కురిపిస్తోన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మ‌హాన‌టి సినిమాను ఓ రేంజ్‌లో ప్ర‌శంసిస్తున్నారు. బుధ‌వారం రాత్రి మ‌హాన‌టి సినిమాను చూసిన కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో త‌న రివ్యూ ఇచ్చారు. 

 

‘ఎంతటి అద్భుతమైన చిత్రం! ‘మహానటి’ సినిమా చూసి దిమ్మతిరిగిపోయింది. కీర్తి సురేశ్‌ సావిత్రి పాత్రలో జీవించేశారు. అద్భుతమైన ప్రదర్శన. ఆమె సినిమాను గొప్పగా తెరకెక్కించిన నాగ్‌ అశ్విన్‌కు, నిర్మాత స్వప్న దత్‌కు‌ నా అభినందనలు. సమంత, విజయ్‌ దేవరకొండ, నాగ చైతన్య చాలా బాగా నటించారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మహానటి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి స్పందన వస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించగా, జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటించారు. ఈసినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. సమంత, విజయ్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. అమెరికాలో కేవలం ప్రివ్యూల ద్వారానే 2,30,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) వసూలు చేసింది. 

 

మ‌హాన‌టిపై కేటీఆర్ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share