ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. వైస్రాయ్ హోట‌ల్ సీన్ లీక్‌..

March 15, 2019 at 5:16 pm

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఈ సినిమాను ఈనెల 22న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే వ‌ర్మ ప్ర‌క‌టించాడు. అయితే.. ఇక్క‌డే అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని ఓ ప‌క్క ఫిర్యాదు వ‌స్తుండ‌గా.. మ‌రో ప‌క్క దీనిని అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌ర‌మూ కాద‌ని.. అదే జ‌రిగితే యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తాన‌ని మొండి వ‌ర్మ గ‌ట్టిగానే చెబుతున్నాడు. ఈ త‌తంగం ఇలా కొన‌సాగుతుండ‌గానే.. ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీల‌క స‌న్నివేశ వీడియో ఒక‌టి లీక్ అయింది.

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్‌కు జ‌నం నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇక ఇందులో ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు, ఆమెను నంద‌మూరి ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేసింది..? చ‌ంద్ర‌బాబు వెన్నుపోటు ఎపిసోడ్‌.. ఇలా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌తో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించాడు. ఆయ‌న మొద‌టి నుంచీ చెబుతున్న‌ట్టుగా పాట‌లు, ట్రైల‌ర్ ఉండ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి.

తాజాగా ఈ సినిమాలోని వైస్రాస్ హోట‌ల్‌కు సంబంధించిన‌ కీలక సన్నివేశం బయటకు లీకవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 6 నిమిషాల నిడివిగ‌ల కీల‌క‌ సన్నివేశం వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతితో క‌లిసి.. వైస్రాయ్ హోటల్ వద్దకు చైతన్య ర‌థంతో రావ‌డం.. ఆయ‌న‌తోపాటు అనుచ‌రులు, అభిమానులంద‌రూ రావ‌డం.. హోట‌ల్ సిబ్బంది అనుచ‌రుల‌ను, అభిమానుల‌ను అడ్డుకోవ‌డం.. ఎన్టీఆర్ బిగ్గ‌ర‌గా అరుస్తూ అనుచ‌రుల‌ను అభ్య‌ర్థించ‌డం.. అక్క‌డే లోప‌ల ఉన్న చంద్ర‌బాబు ఒక‌రితో చెవిలో ఏదో చెప్ప‌డం.. ఆ వెంట‌నే ఎన్టీఆర్‌పై చెప్పులు విస‌ర‌డం.. ఇలా కీల‌క స‌న్నివేశం వీడియో లీక‌వ‌డంతో సినిమాపై అంచ‌నాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. వైస్రాయ్ హోట‌ల్ సీన్ లీక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share