బాబోయ్..లిప్‌లాక్‌ కోసం ఆ హీరో ఏకంగా 19 సార్లు!

September 18, 2018 at 1:37 pm

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా హాలీవుడ్ లో కనిపించేవి..పెదాలను ముద్దుపెడుతూ..నిమిషాల పాటు చూపించే సన్నివేశాలు అక్కడ కామన్ గా చూస్తారు. కొంత కాలం తర్వాత ఆ ఫ్యాషన్ బాలీవుడ్ లోకి పాకింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ప్రేమికుల మద్య లిప్ లాక్ సీన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మద్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాల్లో లిప్ లాక్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదే.

heroine

రెండేళ్ల కిందట వచ్చిన ‘మెట్రో’ మూవీతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో శిరీష్. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న ‘రాజా రంగుస్కి’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నేపథ్యంలో రానున్న ఈ ప్రాజెక్టులో పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో హీరోయిన్ చాందిని హీరో శిరీష్ గురించి కొన్ని సంచలన నిజాలు చెప్పింది. శిరీష్ నటన పరంగా చాలా మెచ్చూర్డ్ గా నటించాడని.. దాదాపు సింగిల్ టేక్‌లో పూర్తి చేశామని.. కానీ, ఓ సీన్‌కి మాత్రం 19 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

తనతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరో అన్ని టేకులు తీసుకుంటుంట..నీ సిగ్గు పక్కన పెట్టి సీరియస్ గా తీసుకో అని చెప్పానని..తానైతే ఫస్ట్ టేక్‌లోనే పర్ఫెక్ట్‌గా చేశానని, ఈ విషయంలో హీరోకి సిగ్గు ఎక్కువని అంటోంది. అందుకే ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బందిపడినట్టు వెల్లడించింది.

బాబోయ్..లిప్‌లాక్‌ కోసం ఆ హీరో ఏకంగా 19 సార్లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share