‘ ల‌వ‌ర్స్ క్ల‌బ్ ‘ సినిమా టాక్….. ఇదో రికార్డే

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం చాలా చిన్న సినిమాలు వ‌రుస‌పెట్టి థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. మొత్తం 10 సినిమాల వ‌ర‌కు రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా వీటిల్లో ల‌వ‌ర్స్ క్ల‌బ్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అంశంతో వార్త‌ల్లోకి ఎక్కింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు దర్శ‌కుడు మారుతి పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. ఈ సినిమా 5 డి కేమేరాతో తెర‌కెక్కింది. చాలా లో బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిన ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

ఆ త‌ర్వాత కెమేరా ప‌రంగా టెక్నాల‌జీ ఎంతోమారినా తాజాగా ద‌ర్శ‌కుడు ధృవ‌శేఖ‌ర్ ల‌వ‌ర్స్ క్ల‌బ్ సినిమాను ఐ ఫోన్ 6 ఫ్ల‌స్‌తో తెర‌కెక్కించాడు. దీంతో పాటు సినిమా ట్రైల‌ర్లు చూసిన వారికి ఇదో డిఫరెంట్ సినిమా అన్న అంచ‌నా ముందే వ‌చ్చేసింది. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు ప్రివ్యూ షోల త‌ర్వాత ఎలాంటి టాక్ వ‌చ్చిందో ? చూద్దాం.

సినిమా క‌థాప‌రంగా చూస్తే హీరో అనిష్ చంద్ర‌, హీరోయిన్ పావ‌ని ఒక‌రినొక‌రు ప్రేమించుకుంటారు. హీరో త‌న ల‌వ‌ర్స్ క్ల‌బ్ ద్వారా ఎంతో మంది ప్రేమ‌జంట‌ల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం బాగుంది. ఈ ప్ర‌య‌త్నంలో అత‌డు ఎంతోమంది ఫ్యామిలీల‌కు టార్గెట్ అవుతాడు. ఇక సెకండాఫ్‌లో ఓ ఆటో డ్రైవ‌ర్ డ‌బ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించ‌డం, వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాల‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది.

హీరో, హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్లు యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. సినిమాలో హీరోయిన్ ఇటు సంప్ర‌దాయంగాను, అటు సిగ‌రెట్లు తాగుతూ మోడ్ర‌న్ డ్రెస్సులు వేసుకుని కుర్ర‌కారును రెచ్చ‌గొట్టేసీన్ల‌లోను యూత్‌కు బాగా పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ సినిమాలో ఇద్ద‌రి గురించి మాత్రం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే.

ఐ ఫోన్ 6 ఫ్ల‌స్‌తో క్వాలిటీ ప‌రంగా రాజీప‌డ‌కుండా సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడు ధృవ‌తో పాటు డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ డీవీఎస్ఎస్ ప్ర‌కాష్‌రావును మెచ్చుకోవాలి. సినిమాలో ర‌న్నింగ్ షాట్లు, యాక్ష‌న్ సీన్లు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ సీన్ల‌లో ఎక్క‌డా క్వాలిటీ మాత్రం త‌గ్గ‌లేదు. ఐ ఫోన్ తో ఇంత బాగా తీయొచ్చని ప్రూవ్ చేసి చాలా మందికి ఇన్పిరేషన్ గా నిలిచారు. డైరెక్ట‌ర్ ధృవ మంచి క‌థాంశంతో చేసిన విభిన్న‌ప్ర‌య‌త్నానికి మంచి మార్కులే ప‌డ‌తాయి. ఐ ఫోన్‌తో మంచి క‌థాబ‌లంతో క్వాలిటీతో ఎలా సినిమా తీయొచ్చో ఫ్రూవ్ చేసిన ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం ఎలా ఉందో చూసేందుకు ఈ సినిమా ఓ సారి చూడాల్సిందే.