‘మా’ నుంచి మహేష్ బాబు తప్పుకున్నాడు!

September 6, 2018 at 12:18 pm

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)ను రోజురోజుకూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. `మా`కు సొంత భ‌వ‌నం నిర్మించుకునేందుకు అసోసియేష‌న్ స‌భ్యులు అగ్ర‌హీరోల‌తో ఈవెంట్స్ నిర్వ‌హిస్తున్నారు. వీటితో స్థ‌ల సేక‌ర‌ణ‌, నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధులు సేక‌రిస్తున్నారు. కోట్లాది రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న స్టార్ హీరోలు, అగ్ర న‌టులు ఉన్న `మా` ఇలా ఈవెంట్స్ నిర్వ‌హించి, నిధులు స‌మ‌కూర్చుకోవ‌డంపై ఓ వైపు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తుంటే… మ‌రో వైపు ఇలా సేక‌రించిన నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇదే విష‌యం ఇటీవల ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిలో రావ‌డంతో ఈ వివాదం మొద‌లైంది.

Mahesh-Babu

ప్ర‌స్తుతం ‘మా’ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్న‌ శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేశారని ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. అయితే.. ‘మా’ కార్యదర్శి నరేశ్‌ కూడా ఆ కథనానికి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేయ‌డంతో అది మ‌రింత ముదిరింది. ఇదే స‌మ‌యంలో నిధులు నిజంగానే దుర్వినియోగం అయ్యాయ‌నే వాద‌న బ‌ల‌ప‌డింది. దీంతో ‘మా’ అసోసియేషన్ రెండువ‌ర్గాలుగా చీలిపోయి ర‌చ్చ‌కెక్కింది. తీవ్ర స్థాయిలో ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. అమెరికాలో మెగాస్టార్ చిరంజీవితో నిర్వహించిన ఈవెంట్లో కొంత డబ్బుని శివాజీ రాజా దుర్వినియోగం చేశారని, ఈ విషయంలో ఆయనకు ‘మా’లో మరికొంతమంది స‌భ్యులు స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

MAA-association-press-meet-on-sri-Reddy-Issue-Gallery-4

ఈ వివాదం చిలికిచిలికి గాలివాన‌లా త‌యారైంది. ఇందులో తన పేరు ప్రస్తావనకు రావడంపై చిరంజీవి కూడా తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఇలాంటి ఈవెంట్ నుంచి మ‌రో అగ్ర‌హీరో త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న మ‌రెవరో కాదు.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు. అక్టోబర్‌లో మహేశ్‌ బాబుతో ఈవెంట్ ఖ‌రారు చేశారు ‘మా’ సభ్యులు. దీనితో ‘మా’ భారీ మొత్తంలో నిధులు స‌మ‌కూరే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాలో మ‌హేశ్‌కు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ.. నిధుల ద‌ర్వినియోగ వివాదం త‌లెత్త‌డంతో ఆయ‌న ఈ వెంట్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే మహేశ్ ఎట్టి ప‌రిస్థితుల్లో ఇక ఈ వెంట్ చేయ‌ర‌నే టాక్ వినిపిస్తోంది. నిజంగా మ‌హేశ్ నిర్ణ‌యం `మా`కు పెద్ద దెబ్బేన‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.

‘మా’ నుంచి మహేష్ బాబు తప్పుకున్నాడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share