‘మా’గొడవ చిరు ఎలా పరిష్కరిస్తారూ!

September 5, 2018 at 3:41 pm
Maa Association, Tollywood, Maa Event USA, Financial, Sivaji Raj, Naresh

ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్‌) రగడ నడుస్తుంది. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న మా సభ్యుల పంచాయితి చిలికి చిలికి గాలి వాన అయ్యింది. మా అధ్యక్షుడు శివాజరాజా వర్సెస్ సినీయర్ నరేష్ మద్య పెద్ద యుద్దమే జరగుతుంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ మీడియాలో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ గొడవ అయినా..దర్శక రత్న దాసరి నారాయణ రావు సమాలోచన చేసి గొడవను సర్ధుబాటు చేసేవారు.

maa

ఇప్పుడు ఆయన లేరు..ఆ బాధ్యత ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘మా’ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిధుల గోల్‌మాల్ మీద మూడు నాలుగు రోజులుగా సంస్థ ప్రెసిడెంట్ శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ మధ్య తలెత్తిన రచ్చ ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడంలేదు. అయితే ఈ వివాదంలో మొదటి నుంచి మెగాస్టార్ అమెరికా టూర్ కి సంబంధించి కావడంతో విషయం కాస్త సీరియస్ గా మారింది. దాంతో నా పేరును ఎందుకు లాగుతున్నారంటూ ఆయన హైరానా పడ్డారట.

Yes--All-Isn-t-Well-In-MAA--Naresh-1535991263-1333

పైగా నరేష్ మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి తలుపులు తట్టి.. మీరు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే ఇది మరింత అధ్వాన్నస్థితికి చేరి పరిశ్రమను భ్రష్టు పట్టిస్తుందని మొర పెట్టుకున్నాడట. గత మూడు రోజులుగా ఉదయం ఒకరు ఒక విధంగా స్టేట్ మెంట్ ఇస్తే..సాయంత్రం మరొకరు మరో విధంగా స్టేట్ మెంట్స్ ఇస్తూ జనాలను..మీడియాను కన్ప్పూజనలో పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ గొడవ ఇప్పుడు మెగాస్టార్ ఇంటి తలుపు తట్టింది. మరి ‘మా’మద్యలో వస్తున్న వివాదం ఎలా సమసిపోయేలా చూస్తారో వేచి చూడాలి.

‘మా’గొడవ చిరు ఎలా పరిష్కరిస్తారూ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share