‘ మ‌హాన‌టి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌..

May 9, 2018 at 10:48 am
Mahanati, Movie, Premier show talk, keerthi suresh, samantha, vijay devara konda,

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాదు… యావ‌త్ ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే మ‌ర్చిపోలేని మ‌హాన‌టి సావిత్రి. అలనాటి మేటిదిగ్గ‌జ మ‌హాన‌టి అయిన సావిత్రి జీవిత చ‌రిత్ర ఓ అద్భుతం. ఇక ఆమె జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా మ‌హాన‌టి. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటిసారిగా ఒక మంచి సినీ తార బయోపిక్ తెరకెక్కడం గొప్ప విషయమని చెప్పాలి. అగ్ర నిర్మాత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మించిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తిసురేష్ న‌టించ‌గా, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ఫేం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

మ‌హాన‌టి ప్రీమియ‌ర్ షోలు ఇప్ప‌టికే చాలా చోట్ల కంప్లీట్ అయ్యాయి. ప్రీమియ‌ర్ల టాక్ ప్ర‌కారం సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఇక సినిమా ఫ‌స్టాఫ్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ముందుకు సాగుతుంది. ముందుగా సావిత్రి జీవితం అన‌గానే ద‌ర్శ‌కుడు ఆ నాటి వాతావ‌ర‌ణాన్ని తెర‌మీద చ‌క్క‌గా చూపించాడు. ద‌ర్శ‌కుడు ఆ మూడ్‌ను క్యారీ చేయ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. ఇక సావిత్రి కెరీర్‌లో తెర‌కెక్కిన 11 సినిమాల షూటింగ్‌ను చూపించిన తీరుకు అంద‌రు ఫిదా అవుతున్నారు.

 

ఆ నాటి సినిమాల షూటింగ్ వాతావ‌ర‌ణం, యూనిట్‌లో తోటి న‌టీన‌టుల‌తో ఎలా మెలుగుతారు ? అన్న తీరుతో పాటు సావిత్రిగా చేసిన కీర్తి సురేష్ రోల్ సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లింది. త‌న పాత్ర‌లో ఒదిగిపోయిన కీర్తి సురేష్ సావిత్రి రోల్‌కు న్యాయం చేయ‌డంతో పాటు అవార్డ్ విన్నింగ్ పెర్పామెన్స్‌తో మెప్పించింది. ఆమె పాత్ర‌కు కీర్తి త‌ప్పా ఎవ్వ‌రూ న్యాయం చేయ‌లేద‌ర‌న్న మంచి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను కీర్తి క‌ట్టిప‌డేసింది. 

 

ఇక సావిత్రి గురించి అన్వేష‌ణ చేసేలా క‌థ అంతా స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండతోనే ట్రావెల్ అవుతుంది. అయితే క‌థ‌లో కొన్ని స‌న్నివేశాలు క‌థ మూడ్‌ను డైవ‌ర్ట్ చేసేలా ఉన్నాయి. ఫ‌స్టాఫ్ చాలా సూప‌ర్బ్‌గా ఉన్నా సెకండాఫ్ క‌థ‌నం నేప‌థ్యంలో కాస్త స్లో అయ్యింది. సెకండ్ హాఫ్‌లో చివ‌రి 30 నిమిషాలు సినిమా కంట‌త‌డి పెట్టిస్తుంది. సావిత్రి ప‌త‌న‌మైన తీరు గుండెలు పిండేసేలా చిత్రీక‌రించారు.

 

ఎమోషనల్ సీన్స్ లో ప్రతి ఒక్కరు చాలా గొప్పగా నటించారు. ఇక నేప‌థ్య సంగీతం, పాట‌లు కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఇక ఓవ‌రాల్‌గా మ‌హాన‌టి చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమాగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించారు. రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేము గాని సావిత్రి జీవితం గురించి ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేని ఓ మంచి సినిమా. 

 

‘ మ‌హాన‌టి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share