మ‌హాన‌టికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌

May 18, 2018 at 11:06 am
Mahanati, Savitri Biopic, satilight rights, movie

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో వచ్చిన మహానటి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వీరంగం క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే తొలి వారం ముగిసే స‌రికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.17 కోట్ల షేర్ రాబ‌ట్టి లాభాల్లోకి వ‌చ్చేసిన ఈ సినిమా రెండో వారంలోనూ స్ట‌డీగా వ‌సూళ్లు సాధించ‌డంతో ఈ సినిమా సాధించే వ‌సూళ్లు స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

 

ప్ర‌స్తుతం ఓవ‌ర్సీస్‌లో మ‌హాన‌టికి తిరుగులేకుండా పోయింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మిగిలిన సినిమాల‌ను లేపేసి మ‌రీ మ‌హాన‌టి సినిమా ఆడిస్తున్నారు. బీ, సీ సెంట‌ర్ల‌లో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా మ‌హాన‌టి సినిమాయే ఆడుతోంది. ఇక ఏ సెంట‌ర్ల‌తో పాటు మల్టీప్లెక్సుల్లో షోలు పెంచుతున్నారు. రిలీజయిన అతి తక్కువ టైంలో మహానటి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. 

 

ఇక ఈ సినిమాపై నిర్మాత‌ల‌కు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో తాజాగా ఆ సినిమా సృష్టిస్తోన్న ప్ర‌భంజ‌న‌మే చెపుతోంది. మ‌హాన‌టి రిలీజ్‌కు ముందు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం కేవ‌లం రూ.5 కోట్ల‌ను ఛానెల్స్ ఆఫ‌ర్ చేశాయి. సినిమా రిలీజ్ అయిన మొద‌ట్లో మంచి టాక్ రావ‌డంతో దీనిని రూ.11 కోట్ల‌కు పెంచాయి. ఇప్పుడు ఆ రేట‌ను ఏకంగా రూ.22 కోట్ల‌కు పెంచాయి. షాక్ ఏంటంటే ఇంత ఈ రేటు పెద్ద హీరోల సినిమాల కంటే చాలా ఎక్కువ‌. ఇంత రేటు వ‌చ్చినా మ‌హాన‌టి శాటిలైట్ రైట్స్ అమ్మేందుకు నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్‌, ఆయన కుమార్తెలు ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. 

 

మ‌హాన‌టికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share