మ‌హాన‌టి శాటిలైట్‌.. అశ్వ‌నీద‌త్‌కు బిగ్ జాక్‌పాట్‌

May 13, 2018 at 10:29 am
' నా నువ్వే ' తో క‌ళ్యాణ్‌రామ్ షాకింగ్ ట్విస్ట్‌

అశ్వ‌నీద‌త్ సినిమాలంటే బ‌య్య‌ర్ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చాలా న‌మ్మ‌కం. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఎంతైనా అడ్వాన్స్‌లు ఇస్తారు. సినిమా ఏదైనా తేడా కొడితే ఆయ‌న వాళ్ల‌కు పూర్తిగా న్యాయం చేస్తారు. వ‌చ్చిన న‌ష్టాల‌ను తిరిగి ఇవ్వ‌డ‌మో లేదా ఆ న‌ష్టాలు త‌ర్వాత సినిమాల్లో భ‌ర్తీ చేసే విష‌యంలో ఆయ‌న ఎవ్వ‌రికి ఎలాంటి అన్యాయం చేయ‌రు. బిజినెస్ పూర్తిగా కంప్లీట్ అయ్యాకే ఆయ‌న త‌న సినిమాను మార్కెట్లోకి వ‌దులుతారన్న టాక్ కూడా ఉంది. 

 

ఇక తాజాగా ఆయ‌న బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా మ‌హాన‌టి. మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇక ఈ సిన‌మా శాటిలైట్ విష‌యంలో అశ్వ‌నీద‌త్ అదిరిపోయే జాక్‌పాట్ కొట్టారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందు అమ్మ‌లేదు. 

 

మ‌హాన‌టి బ‌యోపిక్ కావ‌డంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకునేందుకు సినిమా రిలీజ్‌కు ముందే జీ తెలుగు, జెమిని ఛానెల్స్ మధ్య గట్టిపోటీ నడిచినప్పటికీ డీల్ మాత్రం సెట్ కాలేదు. ఇంత‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం, సినిమాకు సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ రావ‌డంతో ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు మామూలుగా ప‌ల‌క‌డం లేదు.

 

గ‌తంలో అశ్వనీద‌త్ ఆశించిన రేటు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మొత్త‌మే ఆఫ‌ర్ చేస్తున్నాయ‌ట ఒక‌టి రెండు ఛానెళ్లు. మ‌రి ఇప్పుడు మ‌హాన‌టి శాటిలైట్ రైట్స్‌ను ఏ ఛానెల్‌, ఏ రేటుకు సొంతం చేసుకుంటుందో ?  చూడాలి.

 

మ‌హాన‌టి శాటిలైట్‌.. అశ్వ‌నీద‌త్‌కు బిగ్ జాక్‌పాట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share