భ‌ర‌త్ వ‌సూళ్ల క‌థ‌…బ‌య్య‌ర్లు ఇంకా అక్కడే

May 4, 2018 at 2:48 pm
Mahesh babu, Bharat ane nenu, collections, buyers

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సంచ‌ల‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టిన `భ‌ర‌త్ అను నేను` మూవీ వ‌సూళ్ల‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం ఎంత‌?  మీడియా వ‌స్తున్న వార్త‌లు నిజ‌మేనా?  అస‌లు బ‌య్య‌ర్లు ఏమంటున్నారు?  ఈ విష‌యాలు చాలా ఆక‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇండ‌స్ట్రీలోని ఓ వ‌ర్గం చెబుతున్న దాని ప్ర‌కారం మూవీ వ‌సూలు చేసిన‌ట్టు వార్త‌ల్లో వ‌స్తున్న విష‌యాలు, చూపుతున్న లెక్క‌లు స‌రికావ‌ని అంటున్నారు. నిజానికి నేష‌న‌ల్ మీడియా ఈ మూవీ వ‌సూళ్ల‌ను భారీ ఎత్తున హైక్ చేసి ప్ర‌చురిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికి ఈ మూవీ విడుద‌లైన నాటి నుంచి 192 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో ప‌రెగెడుతున్న‌ట్టు కొన్ని పేప‌ర్లు క‌థ‌నాలు రాస్తున్నాయి. అయితే, లోక‌ల్ బ‌య్య‌ర్లు మాత్రం ఇది పెద్ద త‌ప్ప‌ని చెబుతున్నారు. దీనిలో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని అంటున్నారు. 

 

కొన్నిఏరియాల్లో బ‌య్య‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని స‌మాచారం. నిజాం ఏరియాలో ఈ మూవీని అక్క‌డి బ‌య్య‌ర్లు 22 కోట్ల‌రూపాయ‌లకు కొన్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 17.3 కోట్ల షేర్‌ను మాత్ర‌మూ ఈ సినిమా రాబ‌ట్టింది. సీడెడ్‌లోనూ ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని అక్క‌డి బ‌య్య‌ర్లు చెబుతున్నారు. అక్క‌డ ఈమూవీని బ‌య్య‌ర్లు 12 కోట్ల రూపాయ ల‌కు కొన్నారు. అయితే, ఇక్క‌డ వ‌సూళ్లు 9.2 కోట్ల‌కు మించ‌లేద‌ని బ‌య్య‌ర్లు చెబుతున్నారు. వైజాగ్ హ‌క్కులను 8.2 కోట్ల‌కు కొన్నారు. ఇక్క‌డ మాత్రం ఒకింత ఫ‌ర్వాలేదు అన్న‌ట్టుగా వ‌సూళ్లు 8 కోట్లు రాబ‌ట్టారు. తూర్పు గోదావ‌రిలో ఈ సినిమాను 6.7 కోట్ల‌కు కొన్నారు. ఇక్క‌డ భారీ లోటుతో బ‌య్య‌ర్లు అల్లాడుతున్నారు ఇక్క‌డ కేవ‌లం 6.35 కోట్లు రాబ‌ట్టారు. 

 

ప‌శ్చిమ గోదారిలో బ‌య్య‌ర్లు మ‌రింత‌గా లాస‌య్యారు. ఇక్క‌డ 3.9 కోట్లు మాత్ర‌మే బ‌య్య‌ర్లు రాబ‌ట్టారు. ఇంకా మ‌రో 2 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు కావాల్సి వ‌చ్చింది. ఇక‌, ఓవ‌ర్సీస్‌లో ఈ మూవీని 16 కోట్ల‌కు అమ్మారు. ఇక్క‌డ కూడా ప‌రిస్తితి ఇలానే ఉంది. ఇక‌, ఈ మూవీ ప‌బ్లిసిటీ కోసం చేసిన ఖ‌ర్చు సైతం రాలేద‌ని స‌మాచారం. ఇదిలావుంటే, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల్లో మాత్రం ఈ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ క‌లెక్ష‌న్లు సాధించ‌డంతో బ‌య్య‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హ‌క్కులు కొన్న మిక్కిలినేని సుధాక‌ర్ 13 కోట్ల‌కు ఈ మూవీని కొన్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌సూలైన దానిని బ‌ట్టి ఈయ‌న లాభాల్లోనే ఉన్నార‌ని స‌మాచారం. అయితే, మిగిలిన బ‌య్య‌ర్లు మాత్రం ఒకింత క‌ష్టాల్లోనే ఉన్నార‌ని అంటున్నారు. ఇదీ.. భ‌ర‌త్ అను నేను వ‌సూళ్ల క‌థ‌!

 

భ‌ర‌త్ వ‌సూళ్ల క‌థ‌…బ‌య్య‌ర్లు ఇంకా అక్కడే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share