భరత్ పంచ్లు వాళ్ళిద్దరి మీదే

April 20, 2018 at 12:48 pm
Mahesh babu, punches, dialogues, bharat Ane nenu

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భ‌ర‌త్ అనే నేను సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ‘వచ్చాడయ్యో సామీ’ అంటూ తమ అభిమాన హీరోకు ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు. సినిమాకు అన్ని వైపులా నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో మ‌హేష్ అభిమానుల‌తో పాటు సినీ అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

భ‌ర‌త్‌లో ఓత్ సీన్, ట్రాఫిక్ ఇష్యూపై వచ్చే సీన్, అసెంబ్లీ సీన్, దుర్గామహల్ ఫైట్, వచ్చాడయ్యో సామీ సాంగ్ హైలెట్‌గా నిలుస్తాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక సినిమాలో సీఎం రోల్ చేసిన మ‌హేష్ ఇద్ద‌రిని టార్గెట్‌గా చేసుకుని వేసిన పంచ్‌లు, సెటైర్ల‌కు థియేట‌ర్ల‌లో సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులు దోచుకోవ‌డం…. దాచుకోవ‌డం అనే దాంట్లో మునిగి తేలుతున్నార‌ని.. వీరికి జ‌నాల బాధ‌లు ప‌ట్ట‌వ‌ని వేసిన సెటైర్లు బాగున్నాయి.

 

రాజ‌కీయ నాయ‌కులు పార్టీల‌తో సంబంధం లేకుండా జ‌నం వేరు… మ‌నం వేరు అనేలా తెర‌ముందు తిట్టుకుంటూ తెర‌వెన‌క ఎలా ఒక్క‌ట‌వుతున్నారో ? అన్న అంశంపై కూడా మ‌హేష్ వాళ్ల‌ను టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేశాడు. ఇక హీరోయిన్‌తో తాను అసెంబ్లీలోనే రాస‌లీల‌లు న‌డుపుతున్న‌ట్టు కొంద‌రు కుట్ర చేయ‌డంతో అది మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తుంది. అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టిన మ‌హేష్ అటు రాజకీయ నాయ‌కుల‌తో పాటు మీడియా వాళ్ల‌ను కూడా టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు పేల్చాడు.

 

తాను సీఎంగా చేసిన అభివృద్ధి మీకు క‌న‌ప‌డ‌లేదు… ఆమెతో క‌లిసుంటే దానినే రాస‌లీలంటూ ప్ర‌చారం చేశారు.. మీ పేప‌ర్ల కాపీలు, ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు ఇంత‌లా దిగ‌జారాలా ? అంటూ ప్రస్తుత మీడియా వ్యవస్థపై కూడా వేసిన సెటైర్లు, పంచ్‌ల‌కు కూడా సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తోంది. ద‌ర్శ‌కుడు కొర‌టాల కావాల‌నే ఈ సెటైర్లు విసిరిన‌ట్టు కూడా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మొత్తం మీద శ్రీమంతుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో హిట్ సినిమా ‘భరత్ అనే నేను’ అని అభిమానులు చెబుతున్నారు.

‘భ‌ర‌త్ అనే నేను’ TJ రివ్యూ

 

భరత్ పంచ్లు వాళ్ళిద్దరి మీదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share