‘ స్పైడ‌ర్ ‘ న‌ష్టం ఎన్ని కోట్లో తెలిస్తే అంతే

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స్పైడ‌ర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా చ‌తికిల‌ప‌డింది. ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఫైన‌ల్ షేర్ వరల్డ్ వైడ్ రూ. 62.21 కలెక్ట్ చేసింది.

ఈ లెక్క‌న ఈ సినిమాకు స‌గానిపైగా న‌ష్టాలు వ‌చ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లోను బ‌య్య‌ర్లు 50-60 ఇంకా చెప్పాలంటే కొన్ని ఏరియాల్లో 65 శాతం కూడా న‌ష్ట‌పోయారు. సీడెడ్‌లో అయితే స్పైడ‌ర్ దెబ్బ బ‌య్య‌ర్ల‌కు మామూలుగా ప‌డ‌లేదు. స్పైడ‌ర్ ఎంత చెత్త రికార్డు త‌న పేరుమీద వేసుకుందంటే ఇండియాలోనే అత్యంత చెత్త డిజాస్ట‌ర్ల జాబితాలో స్పైడ‌ర్‌కు మూడో ప్లేస్ ద‌క్కింది.

స్పైడ‌ర్ క్లోజింగ్ షేర్ : (రూ. కోట్లలో)

నైజాం – 9 . 80

సీడెడ్ – 4 . 70

నెల్లూరు – 1 . 85

కృష్ణా – 2 . 55

గుంటూరు – 3 . 60

ఉత్తరాంధ్ర – 3. 90

ఈస్ట్ – 3.76

వెస్ట్ – 2 . 80

———————————–

ఏపీ + తెలంగాణ 32 . 96 కోట్లు

———————————–

ఓవర్సీస్ – 6. 75

రెస్టాఫ్ ఇండియా – 8 . 60

తమిళ్ + మలయాళం – 13 .90

————————————————-

వరల్డ్ వైడ్ ఫైన‌ల్ షేర్ = 62 . 21 కోట్లు

————————————————-

స్పైడ‌ర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మ‌హేష్ దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గ‌ల‌గా అటు మ‌హేష్ చివ‌ర‌గా చేసిన ఐదు సినిమాల్లో నాలుగు ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయ్యాయి. వ‌న్, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ పెద్ద డిజాస్ట‌ర్లు. ఒక్క శ్రీమంతుడు మాత్ర‌మే సూప‌ర్ హిట్‌.