మ‌హేష్ కొత్త సినిమాకు రెండు డిఫ‌రెంట్ టైటిల్స్‌…. ఇవే

ద‌స‌రాకు స్పైడ‌ర్ సినిమాతో భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి డిజ‌ప్పాయింట్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కొర‌టాల – మ‌హేష్ కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌హేష్ ఈ సినిమాలో సీఎంగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో యంగ్ క‌మెడియ‌న్ అల్ల‌రి న‌రేష్ కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు రెండు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు టాలీవుడ్ ఇన్న‌ర్ సైడ్ టాక్‌.

ఈ సినిమా టైటిల్‌పై వ‌స్తోన్న లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ‘కృష్ణా ముకుందా మురారి’ , ‘హరేరామ హరే కృష్ణ’ అనే రెండు టైటిల్స్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి రెండిటిలోనే ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని టాక్. టైటిల్‌ను బ‌ట్టి చూస్తుంటే సినిమా ఫ్యామిలీ + యాక్ష‌న్ జాన‌ర్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.