ద‌టీజ్ మ‌మ్ముట్టి అనాల్సిందే…

February 10, 2019 at 1:30 pm

మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ఇటీవ‌ల న‌టించిన చిత్రం యాత్ర‌… వైస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. అయితే మూవీ ద్వారా త‌న తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మ‌మ్ముట్టి త‌న న‌ట‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల పేర్కోంటున్నాయి. వైఎస్ అభిమానులతోపాటు, తటస్థ ప్రేక్షకులు మ‌మ్ముటి న‌ట‌న‌కు ఫిదా అవుతున్నార‌ట‌. పరభాషా నటుడు వైఎస్‌గా నటించి మెప్పించడం, ప్రేక్షకుల్ని ఒప్పించడం ఆషామాషీ కాద‌ని చెబుతున్నారు.

 

Mammootty-Latest-Yatra

త‌న న‌ల‌భై ఏళ్ల సినీ ప్రస్థానంలో మ‌మ్ముటి 350 సినిమాల్లో న‌టించారు. మొత్తం మూడు జాతీయ అవార్డులు.. ఐదు కేరళ ప్రభుత్వ పురస్కారాలు.. 13 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇవేకాక‌ మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్నారు. మలయాళంలోనే కాక ఇత‌ర‌ భాషల్లోనూ న‌టించి మెప్పించారు. చాలా ఏళ్ల కొంద తెలుగులో న‌టించిన ‘దళపతి’ ‘స్వాతి కిరణం’తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌తో ఆక‌ట్ట‌కున్నారు. ‘స్వాతి కిరణం’తో ఎనలేని పేరు సంపాదించిన ఆయన.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు.

అయితే తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీసిన ‘యాత్ర’ను ఒప్పకోవడం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వేరే రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద తీసే సినిమాలో మమ్ముట్టి న‌టిస్తాడ‌ని ఎవ్వరూ అనుకోలేదు. ఆయన స్థాయికి ఈ సినిమా తగ‌ద‌ని విమ‌ర్శించారు. కానీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా చూసిన వాళ్లందరూ భేష్ మమ్ముట్టి ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. సాదారణంగా బయోపిక్ సినిమాలో తాను ఎవరి పాత్ర చేస్తున్నాడో ఆ వ్యక్తిని అనుకరించడానికే న‌టుడు ప్రయత్నిస్తాడు. కానీ మమ్ముట్టి మాత్రం అంతకుమించి వైఎస్ పాత్రలో ఒదిగిపోయాడు. వైఎస్ పాత్ర‌కు నూటికి నూరుపాళ్లు మ‌మ్ముటి న్యాయం చేశాడ‌ని సినిమా చూసిన స‌గ‌టు ప్రేక్ష‌కుడు అనుకుంటున్నాడు.

ద‌టీజ్ మ‌మ్ముట్టి అనాల్సిందే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share