నాని కొత్త సినిమాకు మాస్ టైటిల్‌

February 14, 2017 at 6:36 am
nani

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ 40 కోట్ల‌ను వ‌సూలు చేసింది. రెండో వారంలోకి ఎంట‌ర్ అవుతున్నా కూడా నేను లోక‌ల్ జోరు మాత్రం త‌గ్గ‌లేదు. ఓ వైపు సింగం-3, ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలు రిలీజ్ అయినా కూడా నేను లోక‌ల్ హ‌వానే బాక్సాఫీస్ వ‌ద్ద కంటిన్యూ అవుతోంది.

10 రోజుల‌కు నేను లోక‌ల్ రూ.26 కోట్ల షేర్ సాధించింది. లాంగ్ ర‌న్‌లో నేను లోక‌ల్ రూ.30-35 కోట్ల షేర్ సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమాతో నాని డ‌బుల్ హ్య‌ట్రిక్ హిట్ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే నాని త్వ‌ర‌లోనే మ‌రో రెండు సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో ఒక‌టి కొత్త ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వంలోను, మ‌రో సినిమా దిల్ రాజు బ్యాన‌ర్‌లోను చేయ‌నున్నాడు.

ఇక శివ డైరెక్ష‌న్‌లో నాని న‌టిస్తోన్న సినిమా షూటింగ్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు టీం అంతా అమెరికాలో తెగ స్పీడ్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఈ మూవీకి ‘మాస్ హీరో’ అనే ఊర మాస్ టైటిల్ ఫిక్స్ చేశారు. గ‌తంలో చాలా టైటిల్స్ అనుకున్నా ఈ టైటిల్ అయితే సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. పైగా మాస్ టచ్ ఉంటేనే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ది. నిర్మాత డీవీవీ దానయ్య కూడా మాస్ హీరో టైటిల్ కే ఫిక్స్ అయ్యార‌ట‌.

 

నాని కొత్త సినిమాకు మాస్ టైటిల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share