మెగా ఫ్యామిలీకి చెక్ పెడుతున్న బాలయ్య

June 6, 2018 at 11:38 am

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మెగా హీరోల సినిమాల‌తో పోటీ ప‌డ‌డం కొత్తేం కాదు. గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగానే ఇది జ‌రుగుతోంది. స‌మ‌ర‌సింహారెడ్డి – స్నేహంకోసం, న‌ర‌సింహానాయుడు – మృగ‌రాజు ఇలా సంక్రాంతికి బాల‌య్య వ‌ర్సెస్ చిరు సినిమాలు వ‌స్తున్నాయంటే బాక్సాఫీస్ వ‌ద్ద వార్ అదిరిపోయేలా ఉండేది. గ‌తేడాది సంక్రాంతికి కూడా వీరిద్ద‌రు త‌మ ప్రెస్టేజియ‌స్ సినిమాల‌తో పోటీ ప‌డ్డారు. గ‌తేడాది మాత్రం ఇద్ద‌రూ గెలిచారు.

గత సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్‌ 150తోనూ, బాల‌య్య త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితోనూ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. రెండు సినిమాలు బాగా ఆడారు. చిరు సినిమాకు బాల‌య్య సినిమా కంటే ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తే బాల‌య్య సినిమాకు చిరు సినిమాను మించిన ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇక ఈ యేడాది సంక్రాంతికి కూడా బాల‌య్య మెగా హీరో ప‌వ‌న్‌తో పోటీ ప‌డి గెలిచాడు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ కాగా, బాల‌య్య జై సింహా హిట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాది కూడా బాల‌య్య మెగా హీరోల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ బయోపిక్‌ సంక్రాంతికే విడుదల ఖాయం అయ్యింది.

ఇక వ‌చ్చే సంక్రాంతికే రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబోలో వ‌స్తోన్న సినిమా కూడా సంక్రాంతికే డేట్ ఫిక్స్ చేశారు. ఇలా ప్ర‌తి సంక్రాంతికి బాల‌య్య మెగా హీరోల‌తో పోటీకి సై అన‌డం ఆస‌క్తిగా మారింది. సంక్రాంతి అంటే ఎవ‌రైనా త‌మ సినిమా రిలీజ్ చేసుకోవాల‌ని చూస్తుంటారు. అలా కాక‌తాళీయంగానే బాల‌య్య మెగా హీరోల‌కు త‌న సినిమాలతో స‌వాల్ విసురుతున్నాడు.

మెగా ఫ్యామిలీకి చెక్ పెడుతున్న బాలయ్య
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share