టాలీవుడ్‌కు భారంగా మెగా హీరోలు… ఇండ‌స్ట్రీ కుదేల్‌..!

February 20, 2018 at 6:29 pm
mega family, tollywood, disasters, movies, loss

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు అంటే ఓ చిన్న సైజ్ క్రికెట్ టీంలా ఉంది. మెగాస్టార్ చిరు, నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రాంచ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, అల్లు శిరీష్ ఇప్ప‌టికే హీరోలుగా ఉన్నారు. ఈ 8 మందితో పాటు ఇప్పుడు చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్‌తో పాటు సాయిధ‌ర‌మ్ సోద‌రుడు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఈ లెక్క‌న మెగా హీరోల్లో 10 మంది వ‌ర‌కు హీరోలే. గ‌త రెండు మూడేళ్లుగా ప్ర‌తి నెల‌లోనూ మెగా హీరోలు న‌టించిన సినిమాలు స‌గ‌టున ఒక‌టి చొప్పున రిలీజ్ అవుతున్నాయి.

 

మెగా హీరోల‌కు టాలెంట్ ఉండి హిట్లు కొడుతూ ఎదిగితే ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌రు. కానీ ఆ ఫ్యామిలీ హీరోల వార‌స‌త్వాన్ని బ‌ల‌వంతంగా జ‌నాల‌మీద‌కు రుద్దుస్తున్నారా ? అన్న విమ‌ర్శ‌లు కొన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. ఇక తాజాగా గ‌త రెండు మూడేళ్లో ఆ ఫ్యామిలీ హీరోల నుంచి వ‌స్తోన్న సినిమాల ప‌రాజ‌యాలు, ఇండ‌స్ట్రీకి వ‌స్తోన్న భారీ న‌ష్టాలు చూస్తే మెగా ఫ్యామిలీ ఇండ‌స్ట్రీకి భారంగా మారిందా ? ఇండ‌స్ట్రీ ఈ హీరోల సినిమాల దెబ్బ‌కు కుదేల‌వుతోందా ? అన్న సందేహాలు సైతం వ‌స్తున్నాయి.

 

ప‌వ‌న్ న‌టించిన చివ‌రి నాలుగు సినిమాలు చూస్తే గోపాల గోపాల‌కు లాభాలు లేవు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు, తాజాగా అజ్ఞాత‌వాసి సినిమాల దెబ్బ‌కు ఆ సినిమాలు కొన్న బ‌య్య‌ర్లు ఇప్ప‌ట్లో కోలుకునే ఛాన్సులు లేవు. ఈ మూడు సినిమాల న‌ష్టం రూ.120 కోట్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. ప‌వ‌న్ సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు రోడ్లెక్కి ధ‌ర్నాలు కూడా చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

 

ఇక ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీ నెంబ‌ర్ 150 లాభాలు ఇచ్చింది. ఇక చెర్రీ గోవిందుడు అంద‌రివాడేలే, బ్రూస్‌లీ డిజాస్ట‌ర్లు. ఈ రెండు సినిమాల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ధృవ హిట్ అయినా పెద్ద‌గా లాభాలు లేవు. మ‌నోడి మార్కెట్ పెర‌గ‌డం లేద‌న్న టాక్ ఉంది. వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఫిదాతో భారీ లాభాలు రాగా తొలిప్రేమ కూడా లాభాల భాట‌లోనే ఉంది. 

 

ఇక సాయిధ‌ర‌మ్‌తేజ్ ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఐదు వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఉన్నాడు. తిక్క – విన్నర్ – నక్షత్రం – జవాన్ – ఇంటెలిజెంట్ ఈ ఐదు సినిమాల దెబ్బ‌తో రూ.50 కోట్లు హంఫ‌ట్ అయ్యాయి. అంటే ప‌వ‌న్‌, సాయి క‌లిపే రూ.170 కోట్ల‌కు ముంచిన‌ట్టే అయ్యింది. ఇక వ‌రుస హిట్ల‌తో ఉన్న  బ‌న్నీ డీజే సినిమాను భారీ రేట్ల‌కు అమ్మ‌గా అది కూడా న‌ష్టాలే మిగిల్చింది. ఈ సినిమా రూ.8-10 కోట్ల వ‌ర‌కు లాస్ అయిన‌ట్టు టాక్‌. 

 

ఇక అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం రూ.10 కోట్ల‌కు ముంచిదని ఇన్నర్ టాక్‌. ఇలా చూస్తే ఓవ‌రాల్‌గా మెగా ఫ్యామిలీ హీరోలు రూ.190 కోట్ల వ‌ర‌కు త‌మ సినిమాల‌ను న‌మ్ముకున్న వారిని ముంచిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సర్కిల్స్‌లోను, ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు అంటే భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. మ‌రి ఇక‌పై అయినా వీరు నాసిర‌కం క‌థ‌ల‌తో కాకుండా హిట్లు ఇచ్చే సినిమాలు తీసి ఈ పేరును పోగొట్టుకుంటార‌ని ఆశిద్దాం.

 

టాలీవుడ్‌కు భారంగా మెగా హీరోలు… ఇండ‌స్ట్రీ కుదేల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share