మెహ‌బూబా వ‌సూళ్లు…పూరీకి ఓ పీడకలే

May 14, 2018 at 1:14 pm
Mehbooba, Collections, Puri Jaganath, disappoint

పూరి జ‌గ‌న్నాథ్ గ‌త సినిమాల‌కు భిన్నంగా ఉంటుంద‌ని అంద‌రూ ఆశించిన మెహ‌బూబా విష‌యంలో అంద‌రూ అనుకున్న‌ట్టు స్టోరీ లైన్ కొత్త‌గా ఉన్నా ఫ‌లితం మాత్రం పూరి గ‌త సినిమాల కంటే దారుణాతి దారుణంగా ఉంది. పూరి రాత మారుస్తుంద‌ని అంద‌రూ అనుకుంటే పూరిని మ‌రింత పాతాళంలో ప‌డేసింది. పూరి గ‌త సినిమాల‌కు మంచి ఓపెనింగ్స్ అయినా వ‌చ్చాయి… మెహ‌బూబా విష‌యంలో అది కూడా జ‌ర‌గ‌లేదు.

 

నైజాంలో ఈ సినిమా తొలి రోజు కేవ‌లం రూ.24 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టింది. ఇక యూఎస్‌లో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టాల‌ని చిత్ర యూనిట్ యూఎస్ టూర్ ప్లాన్ చేసింది. ప్రీమియ‌ర్ల నుంచే అక్క‌డ సంద‌డి చేసింది. ప్రిమియర్లతోనే బ్యాడ్ టాక్ మొదలవడంతో జనాలు ఈ సినిమాను తిప్పికొట్టారు. మ‌రోప‌క్క లిమిటెడ్ రిలీజ్ అయిన మ‌హాన‌టి దూకుడు దెబ్బ‌తో మెహ‌బూబా వైపు చూసేవాళ్లే క‌రువ‌య్యారు.

 

గురు.. శుక్ర.. శనివారాల్లో కలిపి ఈ చిత్రం అక్కడ 71788 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. విచిత్రం ఏంటంటే వీకెండ్‌లో శ‌నివారం మెహ‌బూబాకు కేవ‌లం 12260 డాల‌ర్లు వ‌చ్చాయి. అదే రోజు మ‌హాన‌టికి ఏకంగా 4.23 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌చ్చాయి. 12 వేల‌కు, 4.23 ల‌క్ష‌ల‌కు ఏ మాత్రం సంబంధం లేదు. ఒకే వారంలో రిలీజ్ అయిన రెండు తెలుగు సినిమాల మ‌ధ్య ఈ రేంజ్‌లో అంత‌రం ఉందంటే అక్క‌డ జ‌నాలు మెహ‌బూబాను ఎలా తిప్పికొట్టారో తెలుస్తోంది.

 

మ‌రోవైపు మ‌హాన‌టి ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసి 1.5 మిలియ‌న్ మార్క్ దిశ‌గా దూసుకు వెళుతోంది. ఇక మెహ‌బూబాకు ఓవ‌ర్సీస్‌లో లాంగ్ ర‌న్‌లో వ‌సూళ్ల‌న్ని క‌లిపితే ఈ చిత్ర యూనిట్ అక్క‌డ ప్ర‌మోష‌న్ కోసం చేసిన ఖ‌ర్చులు కూడా వ‌చ్చే ప‌రిస్థితిలు క‌న‌ప‌డ‌డం లేదు. పాపం పూరి, పాపం ఆకాశ్ అనుకోవాల్సిందే.

 

మెహ‌బూబా వ‌సూళ్లు…పూరీకి ఓ పీడకలే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share